
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జనవరి తొలి వారం నుంచి జరగనున్న చివరి రెండు టెస్టులకు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నాడు. భార్య అనుష్క డెలివరీ దృష్ట్యా కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతని స్థానంలో ఆసీస్ టూర్‌కు రోహిత్ శర్మను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముందు ప్రకటించిన జట్టులో రోహిత్‌ను సెలక్టర్లు పక్కనపెట్టిన తెలిసిందే. ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీన్ని సాకుగా చూపి అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని తెలిసింది. అయితే, కోహ్లితో విభేదాల కారణంగా హిట్‌మ్యాన్‌ను ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పించారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనకు ఆటగాళ్లు భార్యా పిల్లలను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది.
(చదవండి: ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్!)
Comments
Please login to add a commentAdd a comment