సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి నోట్‌బుక్ లను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంఐ నోట్ బుక్ 14 పేరుతో తీసుకొచ్చింది. అందరూ ఎదురు చూసినట్టుగానే హారిజన్ ఎడిషన్ ను కూడా లాంచ్ చేసింది. వీటి ప్రారంభ దరలు రూ.54999, రూ. 41999గా ఉంచింది. ఈ ప్రారంభ ధరలు జూలై 16 వరకు మాత్రమే చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది.
అయితే గుడ్ న్యూస్ ఏమింటంటే ఈ రెండింటిపైనా రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించనుంది. అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. జూన్ 17 నుంచి అమెజాన్, షావోమి ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో కొనుగోలుకు లభ్యం. అద్భుతమైన డిజైన్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ,ఇంటెల్ కోర్ 10 వ జెన్ ప్రాసెసర్ల (కోర్ ఐ 7 , కోర్ ఐ 5)తో అయిదు వేరియింట్లతో ల్యాప్ టాప్ విభాగంలోకి షావోమి దూసుకొచ్చింది.
ఎంఐ నోట్‌బుక్ ధరలు
ఎంఐ నోట్‌బుక్ 14 (256 జీబీ): రూ .41,999
ఎంఐ నోట్‌బుక్ 14 (512 జీబీ): రూ .44,999
ఎంఐ నోట్‌బుక్ 14 (ఎన్ విడియా జిపియుతో 512 జీబీ) : రూ .47,999
ఎంఐనోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 5): రూ 54,999
ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 7): రూ .59,999
Comments
Please login to add a commentAdd a comment