షావోమి ఎంఐ నోట్‌బుక్స్, మరో టీజర్ | Mi NoteBook coming soon with Intel  i710th Gen processor | Sakshi
Sakshi News home page

షావోమి ఎంఐ నోట్‌బుక్స్, మరో టీజర్

Published Fri, Jun 5 2020 2:35 PM | Last Updated on Fri, Jun 5 2020 3:10 PM

Mi NoteBook coming soon with Intel  i710th Gen processor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి  భారతీయ ల్యాప్‌టాప్ విభాగంలోకి  కూడా ఎంట్రీ ఇస్తోంది.  బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చి భారతీయ వినియోగదారుల మనసులను కొల్లగొట్టిన షావోమి తాజాగా ఎంఐ నోట్‌బుక్ లను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ధృవీకరించిన సంస్థ వరుస టీజర్లతో ఆసక్తిని రేపుతోంది.  దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న  నోట్ బుక్ మోడల్స్ ప్రవేశంపై  అభిమానులకు  మరింత క్లారిటీ వచ్చింది.  ఇంటెల్ కోర్ఐ ఐ7 10వ జనరేషన్  అల్టిమేట్ ప్రాసెసర్ తో నోట్ బుక్ ను  ఈ నెల(జూన్ ) 11న తీసుకురానున్నామని ఎంఐ ఇండియా తాజాగా తెలిపింది.

అయితే, అధికారిక లాంచ్‌కు ముందే, షావోమి రాబోయే ల్యాప్‌టాప్‌ ఎంఐ నోట్‌బుక్, ఎంఐ నోట్ బుక్ హారిజోన్ ఎడిషన్ పేరుతో రానున్నాయనే సమాచారం లీక్ అయింది.  కాగా చైనాలో కొంతకాలంగా ఎంఐ, రెడ్‌మి సిరీస్ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన్పటికీ, భారతీయ మార్కెట్లో ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడం ఇదే మొదటిసారి. (షావోమి ల్యాప్‌టాప్‌ లాంచ్‌ : ఈ నెలలోనే​)

చదవండి :  రెడ్‌మీ 10 ఎక్స్ వచ్చేసింది..
పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement