note book
-
భారత్‌లోకి రియల్మీ బుక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ రంగ సంస్థ రియల్మీ తొలి ల్యాప్‌టాప్ రియల్మీ బుక్ (స్లిమ్) భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. 14 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, 3:2 స్క్రీన్ రేషియో, 14.9 మిల్లీమీటర్ల మందం, 1.38 కిలోల బరువు, మెటాలిక్ బాడీ, 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3, ఐ5 ప్రాసెసర్‌తో రూపుదిద్దుకుంది. డీటీఎస్ హెచ్డీ సౌండ్, హర్మాన్ బాస్, 11 గంటల బ్యాటరీ లైఫ్, 65 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్, డ్యూయల్ ఫ్యాన్ స్టార్మ్ కూలింగ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. రియల్మీ పవర్‌బ్యాంక్‌తో ల్యాప్‌టాప్‌ను చార్జ్ చేయవచ్చు. ధర 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమరీ రూ.44,999 కాగా, 8 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్ రూ.56,999 ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్స్.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120 హెట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 65 వాట్స్ సూపర్‌డార్ట్ చార్జ్‌తో జీటీ శ్రేణిలో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను కంపెనీ పరిచయం చేసింది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, సోనీ 64 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో జీటీ 5జీ తయారైంది. 35 నిముషాల్లోనే చార్జింగ్ పూర్తి అవుతుంది. 7 జీబీ ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఏర్పాటు ఉంది. 8జీబీ, 128 జీబీ ధర రూ.37,999 ఉంది. 12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.41,999గా నిర్ణయించారు. 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపీ ప్రైమరీ కెమెరాను జీటీ మాస్టర్ ఎడిషన్‌కు పొందుపరిచారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.29,999 వరకు ఉంది. -
షావోమి ఎంఐ నోట్‌బుక్స్, మరో టీజర్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి భారతీయ ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చి భారతీయ వినియోగదారుల మనసులను కొల్లగొట్టిన షావోమి తాజాగా ఎంఐ నోట్‌బుక్ లను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ధృవీకరించిన సంస్థ వరుస టీజర్లతో ఆసక్తిని రేపుతోంది. దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నోట్ బుక్ మోడల్స్ ప్రవేశంపై అభిమానులకు మరింత క్లారిటీ వచ్చింది. ఇంటెల్ కోర్ఐ ఐ7 10వ జనరేషన్ అల్టిమేట్ ప్రాసెసర్ తో నోట్ బుక్ ను ఈ నెల(జూన్ ) 11న తీసుకురానున్నామని ఎంఐ ఇండియా తాజాగా తెలిపింది. అయితే, అధికారిక లాంచ్‌కు ముందే, షావోమి రాబోయే ల్యాప్‌టాప్ ఎంఐ నోట్‌బుక్, ఎంఐ నోట్ బుక్ హారిజోన్ ఎడిషన్ పేరుతో రానున్నాయనే సమాచారం లీక్ అయింది. కాగా చైనాలో కొంతకాలంగా ఎంఐ, రెడ్మి సిరీస్ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన్పటికీ, భారతీయ మార్కెట్లో ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడం ఇదే మొదటిసారి. (షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే) చదవండి : రెడ్మీ 10 ఎక్స్ వచ్చేసింది.. పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్ There you go, Mi fans. The #MiNoteBook will be coming with the latest @IntelIndia i7 10th Gen processor. There are very few #Notebooks in India with this processor. Few more days to go to #MakeEpicHappen. Global Debut on June 11. pic.twitter.com/sEogAecX47 — Mi India (@XiaomiIndia) June 5, 2020 Working on other Notebooks - 🧑💻🔌🧑💻🔌🧑💻🔌😡 Working on #MiNoteBook -🧑💻🧑💻🧑💻🧑💻🧑💻🧑💻🔌😎 Mi fans, guess the #Epic 🔋 life on the upcoming #Mi💻. Get ready to #MakeEpicHappen. Global Debut on June 11.#Xiaomi ❤️️ pic.twitter.com/SvgcPSpAfU — Manu Kumar Jain (@manukumarjain) June 4, 2020 -
ఇతను నిజంగానే గజిని
సూర్య హీరోగా నటించిన గజిని సినిమా గుర్తుందా! తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రతి 15 నిమిషాలకు తన గతాన్ని హీరో మర్చిపోతుంటాడు. ఇలా నిజంగానే ఓ గజిని ఉన్నాడు. తైవాన్‌లో ఉండే అతని పేరు చెన్(26). సిన్చూ కౌంటీలో ఉంటున్న చెన్ను స్థానికులందరూ ‘నోట్‌బుక్ బాయ్’ అని పిలుస్తారు. తొమ్మిదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో చెన్ తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో అతనికి షార్ట్‌టైం మెమొరి లాస్ సమస్య ఏర్పడింది. 5 నుంచి 10 నిమిషాల ముందు జరిగిన ఘటనలు మాత్రమే చెన్కు గుర్తుంటాయి. అంతకుముందు జరిగిన ఏ విషయమూ చెన్కు గుర్తుండదు. దీంతో రోజూ తాను చేసిన పనుల్ని చెన్ అక్షరబద్ధం చేస్తున్నాడు. స్నేహితులతో కబుర్లు, తోటలో పనిచేయడం, మార్కెట్లో కూరగాయలు అమ్మడం.. ఇలా తాను చేసిన ప్రతీపనిని చెన్ ఓ పుస్తకంలో రాసిపెట్టుకుంటాడు. ఈ విషయమై చెన్ మాట్లాడుతూ..‘ఓసారి నా పుస్తకాల్లో ఒకటి కనిపించకుండా పోయింది. నేను చాలా బాధలో మునిగిపోయాను. కన్పించకుండాపోయిన నా నోట్‌బుక్‌ను తెచ్చివ్వాలని నాన్నను అప్పట్లో బ్రతిమాలాను’ అని అన్నాడు. ప్రస్తుతం 26 ఏళ్ల వయస్సున్న చెన్ తన పెంపుడు తల్లి వాంగ్ మియో సియాంగ్(65)తో కలిసి ఉంటున్నాడు. తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం చేసిన కొద్దిపాటి సాయానికి తోడు తమకున్న భూమిలో పండ్లు, కూరగాయలు సాగుచేస్తూ చెన్, అతని తల్లి జీవిస్తున్నారు. ఇంతకాలం తాను తోడుగా ఉన్నప్పటికీ, తానుపోయాక చెన్ను చూసుకునే వారు ఎవరూ లేరని తల్లి ఆందోళన చెందుతోంది. -
నోట్‌బుక్‌పై టిప్పు సుల్తాన్
ఇది స్కూళ్లు రీ ఓపెన్ అయిన సమయం. పిల్లలందరూ కొత్త నోటు పుస్తకాలపై నేమ్ స్లిప్స్ అంటించుకుంటారు. కామిక్ బొమ్మలు, పూలు, జంతువులు... ఇలాంటి నేమ్‌స్లిప్స్ ఉంటాయి సాధారణంగా. కాని ఉండవల్లికి చెందిన నశీర్ అహ్మద్‌కు వినూత్నమైన ఆలోచన వచ్చింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న యోధుల నేమ్ స్లిప్స్‌ను తయారు చేస్తే అవి పిల్లలకు స్ఫూర్తినిస్తాయి కదా అనుకున్నారు. లక్షలాదిగా తయారు చేసి ఆయన ఉచితంగా పంచుతున్న నేమ్‌స్లిప్స్ పిల్లలకు తెలియని చరిత్ర తెలియచేస్తున్నాయి. కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి. నశీర్ అహ్మద్ (మొబైల్: 82476 77127 ) ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన కృషిని పంచుకున్నారు. ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ఎంతోమంది ముస్లిం సమరయోధులు పాటుబడ్డారు... ‘జైహింద్’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు సృష్టించారు. చరిత్రలో వీరికి స్థానం కల్పించకపోవడంతో వారి త్యాగాలకు గుర్తింపులేకుండా పోయింది. సుభాష్ చంద్రబోస్‌కి ‘నేతాజీ’ అన్న బిరుదు ఇచ్చింది, అల్లూరి సీతారామరాజుకి తుపాకి పట్టడం నేర్చింది ముస్లింలే. ఇటువంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఈ తరం బాలలు తెలుసుకోవాలనే స్కూల్ బుక్స్ మీద అంటించుకునే నేమ్స్లిప్స్కు రూపకల్పన చేశాను. ఇరవై ఏళ్లుగా కృషి ‘మాది గుంటూరు జిల్లా. గతంలో జర్నలిస్టుగా పనిచేశాను. స్వాతంత్య్రం కోసం పాటుబడిన ముస్లిం సమరయోధుల మీద గత 20 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నాను. తెలుగులో వీరి మీద రాసిన పుస్తకాలు నాతోనే ప్రారంభం అని నేను అనుకుంటాను. ముస్లింల త్యాగాల గురించి చాలామంది ముస్లింలకే తెలియదు. ఇక ముస్లిమేతర సోదరులకు తెలియడం అసంభవం. ఆ క్రమంలోనే వారి గురించిన సమాచారం ప్రజల్లోకి తీసుకురావాలనే సంకల్పం కలిగింది. పుస్తక రూపంలోను, ఆల్బమ్స్గాను రూపొందిస్తే అందరికీ త్వరగా చేరువవుతుందనే ఉద్దేశంతో పుస్తకాలుగా ప్రచురిస్తున్నాను. ముస్లిం యోధుల పేరు మీద పిల్లలకు పుస్తకాల మీద వేసుకునే లేబుల్స్ తయారుచేస్తున్నాను. వాటి మీద సమరయోధుల పేరు, ఆ కింద వారికి సంబంధించిన ఒక లైను రాసి ఉంటుంది. ఆ లేబుల్ వారి పుస్తకం మీద కనీసం మూడునాలుగు నెలలు ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ వారు ఆ బొమ్మ చూస్తూ ఉంటారు. పిల్లల మనసుల్లో ఈ బొమ్మలు ముద్రితమవుతాయి. పూర్వీకుల వివరాలు తెలుస్తాయి. అందువల్ల ఈ విధంగా రూపొందించాను. మొత్తం పది లక్షల స్టిక్కర్లు ఉచితంగా పంపిణీ చేయబోతున్నాను. ఇందుకు ఎంతోమంది మిత్రులు సహకరిస్తు న్నారు’. 13 పుస్తకాలు ‘1998 లో మొదటి పుస్తకం ‘భారత స్వాతంత్య్రోద్యమ ముస్లిం మహిళలు’ అనే పుస్తకం రచించి ప్రచురించాను. ఆ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. చాలామందికి ముస్లిం మహిళల గురించి ఒక అపోహ ఉంటుంది– వారు బురఖాల నుంచి బయటకు రాలేరని. ఆ అపోహను తునుమాడుతూ ఎంతోమంది మహిళలు భారతదేశం కోసం పాటుబడ్డారని ఆ పుస్తకంలో చెప్పాను. ఇప్పటివరకు మొత్తం 13 పుస్తకాలు రచించాను’. ఫొటో ఎగ్జిబిషన్ ‘పది సంవత్సరాల పాటు కష్టపడి మొత్తం 152 మంది ముస్లిం సమరయోధులకు సంబంధించిన ఫోటోలు సేకరించి వాటిని ఆల్బమ్‌గా తయారుచేశాను. నెల్లూరు జిల్లా గూడూరులో మొట్టమొదటి ప్రదర్శన పెట్టాను. ఆ తరవాత హైదరాబాద్, విజయవాడ, గుంటూరు... ప్రాంతాలలో ప్రదర్శించాక ఆర్థికంగా కష్టం కావడంతో, కొంతకాలం పాటు ఎగ్జిబిషన్ పెట్టడం మానేశాను. ఈలోగా పుణె నుంచి కె.జి పఠాన్ అనే వ్యక్తి పుణేలో ఎగ్జిబిషన్ పెడతామంటూ నన్ను సంప్రదించారు. నేను అంగీకరించాను. ఫొటోలను తెల్ల షీట్ మీద ప్రింటవుట్ తీసి, గోడ మీద నల్ల కర్టెన్ పెట్టి, దాని మీద ఈ షీట్‌ను అతికించారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆ ప్రదర్శన ఎంతో మంది వీక్షించారు. అలా నాకు వారు మార్గం చూపడంతో, చాలా తక్కువ ఖర్చుతో తిరిగి ప్రదర్శనలు ప్రారంభించాను. గుజరాత్, బిహార్, యు.పి, పంజాబ్, తమిళనాడులలో ఈ ఎగ్జిబిషన్లు నిర్వహించబోతున్నాను. విస్తృతంగా స్నేహాలు ఏర్పడటంతో అంతర్జాలం నాకు ఒక మంత్రంగా ఉపయోగపడింది’. అతడు కూడా భగత్‌సింగే ‘మహారాష్ట్రకు చెందిన అష్ఫఖుల్లా ఖాన్ 20 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారి చేత ఉరి తీయబడ్డాడు. అతను జర్నలిస్టు. 14 సంవత్సరాల వయసులో పత్రిక నడిపాడు. ఆయన ‘మేరా వతన్ రహే సదా /మై రహూ యా నా రహూ’ అన్నాడు. ఇవాల్టి తరాలకు భగత్‌సింగ్ తెలుసు. అష్ఫఖుల్లా ఖాన్ గురించి ఎంతమందికి తెలుసు? సహాయ నిరాకరణోద్యమ సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేయమని పిలుపు ఇవ్వగానే మొట్టమొదటగా రాజీనామా చేసిన వ్యక్తి విజయవాడకు చెందిన గులాం మొయిద్దీన్ అని చాలామంది తెలుగువారికి తెలియదు. అల్లూరి సీతారామరాజుకి తుపాకీ పట్టడం నేర్పింది షేక్ సదరుల్లాఖాన్, అంతేకాదు ఆయనకు అండదండలుగా నిలిచింది సదరుల్లా ఖాన్. యూసఫ్ మెహర్ ఆలీ అనే ముస్లిం క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించాడు. ఈ సమాచారం చాలామందికి తెలియదు’. ఆజాద్ హింద్ ఫౌజ్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ పేరిట ముస్లిం పోరాట యోధులకు సంబంధించిన పుస్తకాన్ని 425 పేజీలతో తీసుకురాబోతున్నాను. నేతాజీ ఆధ్వర్యంలో 1941 నుంచి 1945 వరకు జరిగిన పోరాటంలో పాల్గొన్న ముస్లిం పోరాట యోధుల గురించి ఈ పుస్తకంలో చెప్పబోతున్నాను. అలాగే చరిత్ర సృష్టించిన రజియా సుల్తానా నుంచి సానియా మీర్జా వరకు గల ముస్లిం మహిళల సమాచారంతో మరో పుస్తకం తీసుకురాబోతున్నాను’. మంచిని పెంచాలి ‘విస్మరించబడ్డ వీరులను తెలియచేయడం కాదు, ఈ దేశంలో ఉన్న విభజన సముదాయాల మధ్యసౌభ్రాతృత్వం, సామరస్యం, సహిష్ణుత, స్నేహభావం, సోదరభావం ‘మరింత పటిష్టం’ కావాలని నా లక్ష్యం. సదవగాహన, సద్భావన ఏర్పడాలి. బహుళ సంస్కృతి పరిఢవిల్లాలి. అన్ని మతాలలోను మంచిచెడులుంటాయి. ప్రేమను భ్రాతృత్వాన్ని పెంచుకోవడం మంచిది. అవి మంచిని చెబుతున్నాయి. నేను చేస్తున్నది ఒక వ్యవస్థతో కూడిన పని’. అల్లూరి సీతారామరాజుకి తుపాకీ పట్టడం నేర్పింది షేక్ సదరుల్లాఖాన్, అంతేకాదు ఆయనకు అండదండలుగా నిలిచింది సదరుల్లా ఖాన్. యూసఫ్ మెహర్ ఆలీ అనే ముస్లిం క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించాడు. ఈ సమాచారం చాలామందికి తెలియదు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఆత్మహత్య : నోట్‌బుక్‌లో కీలక అంశాలు
నోయిడా : తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆమె ఇంట్లోని టేబుల్ డెస్క్‌లో నుంచి ఓ నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో.. 'నేను ఫెయిల్యూర్' అంటూ రెండుసార్లు, 'ఐయామ్ డంబ్' అంటూ ఓసారి రాసి పెట్టింది. ఆ చేతి వ్రాత చనిపోయిన విద్యార్థినిదే అని పోలీసులు గుర్తించారు. నోయిడాలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్కూలులో సోషల్, సైన్స్ టీచర్లు తమ కూతురును వేధించారని, అకారణంగా, ఉద్దేశ పూర్వకంగా ఫెయిల్ చేశారని, ఆ అవమానాలతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆమె నోట్‌బుక్‌లో కీలక విషయాలు కనిపించాయి. ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పేందుకు సాక్ష్యంగా ఆ నోట్‌బుక్‌లోని విషయాలు సహకరిస్తాయని పోలీసులు చెబుతున్నారు. 'సైన్స్, సోషల్ టీచర్లు తనను అసభ్యంగా తాకుతున్నారని, నా కూతురు నాకు చెప్పింది. అయితే, నేను కూడా ఓ టీచర్నే అవడంతో ఉపాధ్యాయులు అలా చేయలేరని చెప్పాను. అలా నేను చెప్పడమే పొరపాటైంది. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే బాగుండేది. నా కూతురు ఎంత బాగా పరీక్ష రాసినా వారు నిజంగానే ఫెయిల్ చేశారు' అంటూ విద్యార్థిని తండ్రి చెప్పాడు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు స్కూల్ యాజమాన్యం కొట్టిపారేసింది. ఆ విద్యార్థిని కోసం మరోసారి పరీక్ష కూడా పెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. -
లేటెస్ట్ టెక్నాలజీతో హ్యాండ్‌బ్యాగులు
మగువల భుజాన్ని అంటిపెట్టుకుని ఉంటూ.. వారి అవసరాలన్నీ తీర్చే నేస్తం హ్యాండ్‌బ్యాగ్. మనీ, మొబైల్‌ఫోన్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, హెయిర్ బ్రష్.. ఇలా ముదితలకు చెందిన ముఖ్యమైన వస్తువులను అపురూపంగా మోస్తుంది. తమకు కావాల్సినవన్నీ మోసే హ్యాండ్‌బ్యాగ్స్‌ను యువతులు కూడా అంతే అపురూపంగా చూసుకుంటుంటారు. మార్కెట్లోకి కొత్త మోడల్ రాగానే సొంతం చేసుకుంటారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా నయా మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నారు డిజైనర్లు. ..:: శిరీష చల్లపల్లి ఒకప్పుడు కాలేజ్ గాళ్స్.. సబ్జెక్ట్‌కో నోట్‌బుక్, జామెట్రీ బాక్స్, టిఫిన్ బాక్స్.. వాటర్ బాటిల్.. ఇలా స్టేషనరీని వెంటేసుకుని కాలేజీకి వెళ్లేవారు. వీటన్నింటినీ మోసే బ్యాగ్‌ను భుజాలకుతగిలించుకుని భారంగా నడిచేవాళ్లు. ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఇంటర్ స్టూడెంట్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ వరకూ అందరూ హ్యాండ్‌బ్యాగ్ లేనిదే గడప దాటడం లేదు. వారి వారి అవసరాలకు తగ్గట్టుగా రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. రకరకాలు.. కొత్త హంగులతో ముస్తాబై వస్తున్న బ్యాగులను మగువలు విపరీతంగా ఆదరిస్తున్నారు. యువతులే కాదు..అమ్మలు.. అమ్మమ్మలు కూడా ఏజ్‌కు తగ్గట్టుగా హ్యాండ్‌బ్యాగ్‌లు మెయింటేన్ చేస్తున్నారు. డాక్టర్ బ్యాగ్, బో బ్యాగ్, క్రాస్ బాడీ బ్యాగ్, రిస్లెట్ బ్యాగ్, మెసెంజర్ బ్యాగ్, క్లచ్ బ్యాగ్, బ్యారెల్ బ్యాగ్, డ్రాస్ట్రింగ్ బ్యాగ్, సాడిల్ బ్యాగ్, స్ట్రక్చర్డ్ బ్యాగ్, టోటె బ్యాగ్ ఇలా రకరకాల బ్యాగ్‌లు టీనేజ్ అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకూ ఎవరికి వారే ఫంక్షన్లలో స్టయిల్ ఐకాన్‌గా నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. మ్యాచింగ్ మస్ట్.. టీనేజ్ అమ్మాయిలైతే ఎక్కువగా స్లింగ్ బ్యాగులు, టోటే బ్యాగులను ఎంచుకుంటున్నారు. కాలేజీ అమ్మాయిలైతే సింగిల్ హ్యాండ్‌తో వాళ్ల డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే హ్యాండ్‌బ్యాగ్స్‌ను ప్రిఫర్ చేస్తున్నారు. రెండు నోట్బుక్లు, మొబైల్ ఫోన్, పెప్పర్ స్ప్రే ఇమిడిపోయేవి తీసుకుంటున్నారు. లైట్‌వెయిట్ హ్యాండ్ బ్యాగ్‌లతో ఫెమినిన్‌గా, క్యూట్‌గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా.. నయా పోకడలతో అప్డేట్ అవుతున్న డిజైనర్లు సైతం రకరకాల మెటీరియల్స్‌తో హ్యాండ్‌బ్యాగులు తయారు చేస్తున్నారు. డ్రెస్‌లు డిజైన్ చేసినట్టే హ్యాండ్‌బ్యాగ్‌లను కూడా కస్టమైజ్డ్గా తీసుకొస్తున్నారు. లెదర్, క్లాత్, జ్యూట్, ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల మెటీరియల్స్ వాడుతున్నారు. డబుల్ జిప్, మల్టీ జిప్, క్లచ్ మోడల్ ఇలా వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ వేటికవే స్పెషల్ లుక్‌తో అదరగొడుతున్నాయి. సేఫ్టీ లాకింగ్.. సేఫ్టీ కోసం హ్యాండ్బ్యాగ్స్కు సైతం లాకింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తున్నారు డిజైనర్లు. నంబర్ లాకింగ్, మినీ కీ లాక్, అలారం బేస్డ్ ఇలా రకరకాల లాకింగ్ సిస్టమ్స్ అటాచ్ చేస్తున్నారు. అంతెందుకు జీపీఎస్ టెక్నాలజీని కూడా హ్యాండ్‌బ్యాగ్‌లకు అడాప్ట్ చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్‌లో ఎలక్ట్రానిక్ చిప్ అరేంజ్ చేస్తున్నారు. దీంతో పొరపాటున హ్యాండ్‌బ్యాగ్ అన్ అథెంటిక్ పర్సన్గానీ ఓపెన్ చేశాడంటే.. సదరు హ్యాండ్‌బ్యాగ్ ఓనర్ మొబైల్‌కు, ముందుగా అందులో ఫీడ్ చేసిన మొబైళ్లకు సమాచారం అందుతుంది. తస్కరణకు గురైన మీ హ్యాండ్‌బ్యాగ్ ఏ ఏరియాలో ఉందో కూడా చూపిస్తుంది. ఇలా లేటెస్ట్ టెక్నాలజీతో ముస్తాబైన హ్యాండ్‌బ్యాగులు మార్కెట్లో అదరగొడుతున్నాయి. -
తాబేలు తలకాయ
సృజనం .‘విపంచి’ ఫోన్ మాట్లాడుతూ, కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టాను. అప్పటికే మిగిలినవాళ్లంతా వచ్చి ఉన్నారు. ఇంకా సమావేశం ప్రారంభం కాలేదు కాబట్టి, ఎవరి దారినవాళ్లు నోట్‌బుక్‌తో, లాప్టాప్తో, కొంతమంది మొబైల్ ఫోన్లతో హడావుడి పడుతున్నారు. వెంటనే నేను నా వై-ఫై ఆన్ చేశాను. ఒకతను నావైపు తిరిగి- ‘‘పాస్వర్డ్ చెప్పరా?’’ అనడిగాడు. నేను చెప్పాను. చాలామంది తమ పర్సనల్ నెట్ నుంచి డిస్ కనెక్ట్ అయి, వై-ఫై మీద పడ్డారు. నిజం చెప్పాలంటే మేమెవరమూ సాఫ్ట్వేర్ కాదు. ఓ చాక్లెట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాం. మూడు నెలలకోసారి జరిగే సమీక్షా సమావేశం అది. ఒకోసారి ఒకో టూరిస్ట్ ప్లేస్‌లో పెడుతుంటారు. మూడు నెలల అమ్మకాలు, అందులో ఎగుడుదిగుడుల గురించి చాలామటుకు తలంటి, అడపాదడపా మెచ్చుకుని ఓ రెండు రోజులు జరిపిస్తారు. మూడో రోజు ఆటవిడుపు - మందు పార్టీ, దగ్గర్లో ఏదన్నా చూడదగ్గ ప్రదేశం ఉంటే చిన్న ట్రిప్. మూడు నెలలకోసారి కలుసుకునే అందరికీ ముఖపరిచయమే. అంతకుమించి ఎక్కువ మాట్లాడుకోం. బాగున్నారా? మీ ఏరియాలో ఎలా ఉన్నాయి సేల్స్?... ఇలాంటి పొడి పలకరింపులు, మధ్యమధ్యలో ‘ఎండ దంచేస్తుంది బాసు- మధ్యాహ్నం లంచ్‌తో పాటు బీర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా- బీరు దాతా సుఖీభవ’ - లాంటి కామెంట్స్. అంతకుమించి మాటలేవీ ఉండవు. నెట్లో మాత్రం రెగ్యులర్ టచ్‌లోనే ఉంటాం. చాలామంది ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఆసక్తికరమైన సూక్తులు, ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం, షేర్ చేసుకోవడం చేస్తుంటాం. సాధారణంగా ఏది అప్లోడ్ చేసినా సెకన్లలో లైక్ చేస్తుంటాం. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి శుభాకాంక్షలు- ఎవరైనా చనిపోతే రిప్ (రెస్ట్ ఇన్ పీస్) చెబుతుంటాం. ఇక్కడికొచ్చేంతవరకూ- ఇంకా చెప్పాలంటే, ప్రయాణంలోని అడుగడుగు సంఘటనలు- (రైలులో వెజ్ బిర్యానీ ఛండాలంగా ఉంది- ఎదురు సీట్లో అమ్మాయి బాగుంది- అర్ధరాత్రి రైలాగినప్పుడు యాక్సిడెంట్ కాదుగా అని భయంతో కూడిన కామెంట్స్) అప్డేట్ చేస్తూనే ఉన్నాం. నేనిప్పుడు సరదాగా ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేసి చూశాను. నా కొలీగ్ ఒకతను, ‘మేము అమ్మే చాక్లెట్స్ తియ్యగా ఉంటాయి. కానీ మేము హాజరైన మీటింగ్ మాత్రం చేదుగా ఉంటుంది’ అని కామెంట్ పోస్ట్ చేశాడు. అప్రయత్నంగానే పెదవుల మీద చిరునవ్వు ముంచుకొచ్చింది. వెంటనే లైక్ క్లిక్ చేశాను. చూస్తుండగానే ఆ కామెంట్‌కి చాలా లైక్స్ వచ్చాయి. అందరమూ తలలు దించుకుని, నెట్ చూసుకుంటూ- ఎవరి దారినవాళ్లు చిరునవ్వులు చిందిస్తున్నాం. ఈలోగా సౌతిండియా రీజనల్ మేనేజర్ కరియప్ప వచ్చాడు. ‘‘మన మార్కెటింగ్ టీమ్ ఒక్కచోట చేరామంటే- గలగలా నవ్వులు... సరదా కబుర్లు ఉంటాయనుకున్నాను. అందరూ ఏంటి ఇంత సీరియస్‌గా ఉన్నారు?’’ అన్నాడు కరియప్ప. ‘‘మాటలన్నీ మార్కెట్లో అమ్మేశాం సార్. మా దగ్గర ఏమీ లేవు’’ అన్నాను. ‘‘అదా సంగతి? చాక్లెట్ల బదులు మాటలు అమ్మిన సంగతి సేల్స్ తగ్గడంలోనే తెలుస్తుంది’’ అని సమావేశం ప్రారంభించాడు కరియప్ప. ఏరియా వారీగా ఒక్కొక్కరికి క్లాసులు, సమాధానాలు నడుస్తున్నాయి. ఈ మీటింగ్స్ రొటీన్ అయిపోవడం వల్ల ఏమో - కరియప్ప తిట్టినా, మనసు మందం అయిపోయి, ఒంటికి పట్టదు. ఎట్టకేలకు అతి భారంగా రెండురోజుల మీటింగ్ ముగిసింది. మూడో రోజు దగ్గర్లో ఉన్న కాఫీ తోటలకి వెళ్లాం. కాఫీ గింజలు అమ్ముతుంటుంటే కొన్నాం. ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాత శివాలయం దర్శించుకున్నాం. యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతాల్లో స్నానం చేశాం. ఫొటోలు దిగాం. వెంటనే అవి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాం. కాఫీ గింజల ఫొటో చూసి- ‘మీ ఇంటికి రేప్పొద్దున కాఫీకి వస్తున్నాం’ అని వాల్ మీద రాసేవాళ్లు కొంతమంది -జలపాతం చూసి, ‘లవ్లీ స్పాట్’, ‘యూ ఆర్ లక్కీ’, ‘నెక్స్ట్ టైమ్ గాళ్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లడం మిస్ కాకు’ అని కామెంట్స్ - రెండు రోజుల టెన్షన్ ఆ కామెంట్స్‌తో పోయింది. మనసుకి తెలీని రిలాక్సేషన్ అనిపించింది. నా కొలీగ్ శేఖర్ మాత్రం, ‘‘కరియప్పగాణ్ని బండబూతులు తిట్టాలని ఉంది. కాని ఫేస్బుక్లో పోస్ట్ చేయలేం’’ అన్నాడు. జలపాతం దగ్గరకి వెళ్లి, ‘‘కరియప్పా! నీయబ్బా’’ అని గట్టిగా అరిచాడు. ఆ కొండ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. నా కొలీగ్స్ చాలామంది నవ్వారు. ఒకరిద్దరు మాత్రం ‘కరియప్ప కూడా ఈ స్పాట్ వచ్చి ఉంటే?’ అని భయపడ్డారు. ఆ ఆలోచన... వచ్చిన కొద్దిపాటి ఆనందాన్ని ఆవిరి చేసింది. అక్కడి నుంచి బయల్దేరాం. మళ్లీ ఎవరి ఊళ్లు వాళ్లు, ఎవరి మార్కెట్లోకి వాళ్లు, ఎవరి టార్గెట్ మీద వాళ్లు. ఎవరెవరి చిన్ని ప్రపంచాల్లోకి వాళ్లం వెళ్లిపోయాం. గాలి పేజీల మీద ఉబుసుపోని కబుర్లు పంచుకుంటున్నాం. ఎప్పుడన్నా, ఎవరన్నా డీలర్ గురించో, స్టాక్ గురించో మాట్లాడుకోవాల్సి వస్తే, ఫోన్లు చేయడం తప్ప మిగిలిన కుశల సమాచారాలన్నీ నెట్లోనే. మళ్లీ మూడు నెలలు అయితే గానీ ముఖాముఖీ కలుసుకోం. అయితే అనుకోకుండానే అందరమూ కలుసుకోవలసి వచ్చింది. విజయవాడలోని ఓ స్టాకిస్ట్ చనిపోయాడు. దాదాపు మా కంపెనీలోని రిప్రజెంటేటివ్లందరికీ ఆయన బాగా తెలిసిన వ్యక్తి. అందువల్ల పెద కర్మకి వెళ్లాల్సి వచ్చింది. విజయవాడ బస్టాండ్‌లో బస్ దిగగానే ఆయన ఇంటి అడ్రెస్ కోసం ఎవరికి ఫోన్ చేయాలా అనుకుంటే బస్టాండ్ ఎదురుగానే ఓ వినైల్ కనపడింది. స్టాకిస్ట్ సత్యనారాయణ ఫొటో - అటూ ఇటూ రెండు దీపాలు. ‘మీరు లేని మా జీవితం చంద్రుడు లేని నల్లటి ఆకాశం - మీ జ్ఞాపకాలు మాకు దారి చూపించే మణి దీపాలు- ఇట్లు ’ అని కింద కుటుంబ సభ్యుల పేర్లు. పెద కర్మ ఫలానా తేదీ ఫలానా గంటలకు ఫలానా చిరునామాలో అనే వివరాలున్నాయి. ఆయన ఇంటికి చేరుకోవడం చాలా సులువయ్యింది. కృష్ణలంకలోని ఆయన ఇంటికి వెళ్తుంటే- రకరకాల వినైల్స్, ఫ్లెక్సీలు కనపడ్డాయి. వాడెవడో అశుతోష్ బాబట (ఆ పేరేంటో) అతని పుట్టినరోజు సందర్భంగా అశుతోష్ యూత్ సర్కిల్ శుభాకాంక్షలు-ఇంకెవరో అమ్మాయి - పుష్పవతి అయ్యిందట. ఆ వేడుక గురించి ఆ అమ్మాయి ఫొటోతో వినైల్స్ -మరెవరిదో పెళ్లి - ఆ జంట ఎంగేజ్మెంట్ ఫొటోతో ఫ్లెక్సీలు - సందు సందుకి అర డజను వినైల్స్ అలాంటివి ఉన్నాయి. శేఖర్ వాటిని ఆశ్చర్యంగా చూశాడు. ‘‘చాలా టూమచ్ కదా - పుట్టినరోజుకీ చావుకీ పెద్దమనిషి అయినందుకూ పెళ్లి కుదిరినందుకు - ప్రతిదానికీ పబ్లిసిటీయేనా?’’ అయినా వాళ్ల స్నేహితులకి, చుట్టాలకి ఉత్తరాలు రాసో, ఫోన్లు చేసో చెప్పుకోవచ్చు కదా! ఈ డప్పేంటో? అసహ్యంగా లేదూ?’’ అన్నాడు. నాకూ విచిత్రంగానే ఉంది అదంతా. ఎందుకు ఇలా అన్నీ బయటపెట్టుకుంటారు? దినం భోజనాలైపోయాక- సత్యనారాయణ కొడుకు ఆ వినైల్స్ అతనికి డబ్బులిస్తున్నాడు. ‘‘అన్ని సెంటర్లలో పెట్టాం. బాగానే రెస్పాన్స్ వచ్చిందా అండీ?’’ అనడుగుతున్నాడు ఆ వినైల్ అతను. నేను డైనింగ్ హాల్ని ఒకసారి చూశాను. కనీసం వందమంది కూడా లేరు. సత్యనారాయణ దగ్గరి బంధువులు. మాలాంటి వ్యాపార సంబంధీకులు తప్పితే, అక్కడ ఎవరూ లేరు. ఎవరి కళ్లల్లో పెద్దగా నీళ్లు కూడా లేవు. కొంతమంది అయితే భోజనాల్లో తగ్గిన ఉప్పు కారాల గురించి మాట్లాడుతున్నారు. రెస్పాన్సా? అని నవ్వొచ్చింది. సత్యనారాయణ కొడుకు చెబుతున్నాడు - ‘‘జనం రెస్పాన్స్ గురించి పెట్టలేదు. నాన్న చనిపోయాడనగానే గుండెలు బరువెక్కిపోయాయి. ఆ దిగులు, బాధ ఎలా దించుకోవాలో, ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. అందుకే ఈ వినైల్స్. ఎక్కడో ఏ మూలనో ఏ దూరపు చుట్టమో, మాకు తెలీని మా నాన్న స్నేహితుడో, ఈ బాధని పంచుకుంటాడని’’ అన్నాడు. ఒక్కసారిగా నాకు మా అందరి జీవితాల మీద స్పష్టత వచ్చింది. తాబేలు తన డిప్పలోకి తలదూర్చి బతికేసినట్లు, మేమందరమూ ఎవరి ఇళ్లల్లో వాళ్లు, ఎవరి ఇరుకు బతుకుల్లో వాళ్లున్నాం. మాకు బాధ, కోపం, సంతోషం అన్నీ వస్తుంటాయి. పంచుకోవడానికి ఎవరూ లేరు. అందుకే సోషల్ నెట్వర్కింగ్ పేజీల్లో ప్రతి చిన్నా పెద్దా ముచ్చట్లు షేరింగులు, లైకింగులు, కామెంట్స్... ఇలా బయటి ప్రపంచంలో వినైల్స్, ఫ్లెక్సీలు, హోర్డింగులు... మనిషి తన ఒంటరి జీవితంలో నుంచి బయటి ప్రపంచానికి ఓ వంతెన ఎప్పటికప్పుడు వేద్దామని చూస్తున్నాడు. కాని ఎప్పటికైనా అవతలి వైపుకి చేరుకుంటాడో- లేదో? సత్యనారాయణ దగ్గరి బంధువులు. మాలాంటి వ్యాపార సంబంధీకులు తప్పితే, అక్కడ ఎవరూ లేరు. ఎవరి కళ్లల్లో పెద్దగా నీళ్లు కూడా లేవు. కొంతమంది అయితే భోజనాల్లో తగ్గిన ఉప్పు కారాల గురించి మాట్లాడుతున్నారు.