భారత్‌లోకి రియల్‌మీ బుక్‌ | Realme Book laptop launch | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి రియల్‌మీ బుక్‌

Aug 20 2021 3:42 AM | Updated on Aug 20 2021 3:42 AM

Realme Book laptop launch - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ రంగ సంస్థ రియల్‌మీ తొలి ల్యాప్‌టాప్‌ రియల్‌మీ బుక్‌ (స్లిమ్‌) భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. 14 అంగుళాల ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, 3:2 స్క్రీన్‌ రేషియో, 14.9 మిల్లీమీటర్ల మందం, 1.38 కిలోల బరువు, మెటాలిక్‌ బాడీ, 11వ తరం ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఐ5 ప్రాసెసర్‌తో రూపుదిద్దుకుంది. డీటీఎస్‌ హెచ్‌డీ సౌండ్, హర్మాన్‌ బాస్, 11 గంటల బ్యాటరీ లైఫ్, 65 వాట్‌ సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్, డ్యూయల్‌ ఫ్యాన్‌ స్టార్మ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ వంటి హంగులు ఉన్నాయి. రియల్‌మీ పవర్‌బ్యాంక్‌తో ల్యాప్‌టాప్‌ను చార్జ్‌ చేయవచ్చు. ధర 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్‌ మెమరీ రూ.44,999 కాగా, 8 జీబీ, 512 జీబీ ఇంటర్నల్‌ మెమరీ వేరియంట్‌ రూ.56,999 ఉంది.  

రెండు స్మార్ట్‌ఫోన్స్‌..
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్, 120 హెట్జ్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 65 వాట్స్‌ సూపర్‌డార్ట్‌ చార్జ్‌తో జీటీ శ్రేణిలో రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ పరిచయం చేసింది. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సోనీ 64 ఎంపీ ట్రిపుల్‌ కెమెరాతో జీటీ 5జీ తయారైంది. 35 నిముషాల్లోనే చార్జింగ్‌ పూర్తి అవుతుంది. 7 జీబీ ఎక్స్‌పాండబుల్‌ ర్యామ్‌ ఏర్పాటు ఉంది. 8జీబీ, 128 జీబీ ధర రూ.37,999 ఉంది. 12 జీబీ, 256 జీబీ వేరియంట్‌ ధర రూ.41,999గా నిర్ణయించారు. 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 64 ఎంపీ ప్రైమరీ కెమెరాను జీటీ మాస్టర్‌ ఎడిషన్‌కు పొందుపరిచారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.29,999 వరకు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement