
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తాజాగా విస్తృత శ్రేణి ఉత్పత్తులను పరిచయం చేసింది. వీటిలో రియల్‌మీ వాచ్–2 ప్రో, వాచ్–2, బడ్స్ వైర్‌లెస్–2, బడ్స్ వైర్‌లెస్–2 నియో, బడ్స్ క్యూ2 నియో ఉన్నాయి. ధరల శ్రేణి రూ.1,299 నుంచి రూ.4,999 వరకు ఉంది. జూలై 26 నుంచి కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ఉత్పాదననుబట్టి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. కొద్ది రోజుల్లో ఆఫ్‌లైన్‌లోనూ దొరుకుతాయి.