Xiaomi Mi 11 Mobile Price Leaked, Check India Cost Here I షియోమీ ఎంఐ 11 ప్రైస్ లీక్ - Sakshi
Sakshi News home page

షియోమీ ఎంఐ 11 ప్రైస్ లీక్

Published Wed, Dec 23 2020 4:08 PM | Last Updated on Wed, Dec 23 2020 8:55 PM

Xiaomi Mi 11 Mobile Price Leaked - Sakshi

షియోమీ ఎంఐ 11 సిరీస్ లో భాగంగా రెండు ఫోన్‌లను తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మొబైల్ ని డిసెంబర్ 28న చైనాలో ప్రారంభించనున్నారు. ఈ లాంచ్ కి ముందు ఎంఐ 11 మొబైల్ యొక్క ధరలు మార్కెట్ లోకి లీక్ అయ్యాయి. ఎంఐ 11 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ని 4500 చైనా యువాన్లు/ 687 డాలర్లు(సుమారు 50,500)కు తీసుకురానునట్లు సమాచారం. అలాగే షియోమీ ఎంఐ 11 యొక్క 8/256 జీబీ ఆప్షన్ సిఎన్‌వై4,800(సుమారు రూ. 55,000), 12/256 జీబీ వేరియంట్‌కు సిఎన్‌వై 5,200(సుమారు రూ.60,000) ధర ఉంటుందని సమాచారం.(చదవండి: ఈ మొబైల్స్ వాడేవారికి గుడ్ న్యూస్)

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానున్నట్లు కంపెనీ సీఈవో లీ జున్ ఇప్పటికే వెల్లడించారు. దీని స్పెసిఫికేషన్స్ సంబందించిన పూర్తీ సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిలో ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే తీసుకురానున్నట్లు సమాచారం. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. లీక్‌లు ప్రాథమిక సమాచారం మేరకు 108 మెగాపిక్సెల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. గీక్ బెంచ్‌లో ఈ ఫోన్ M2011K2C కోడ్ నేమ్ తో కనిపించింది. ఈ మొబైల్ 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఈ మొబైల్ ని మన దేశంలో జనవరి లేదా ఫిబ్రవరి నెలలో తీసుకురానున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement