న్యూఢిల్లీ: మోటోరోలా తన మోటో జీ 5జీ మొబైల్ ని భారతదేశంలో నేడు(నవంబర్ 30) లాంచ్ చేయబోతుంది. ఈ కొత్త మోటరోలా మొబైల్ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నట్లు మోటోరోలా తెలిపింది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభిస్తుంది. ఇండియాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750 జీ ప్రాసెసర్‌తో రాబోతున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ మోటో జీ 5 జీ. మోటరోలా మోటో జీ 5 జీ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ వేరియెంట్ ని అంతర్జాతీయ మార్కెట్లలో యూరో 299.99 (సుమారు రూ.26,200)కు విడుదల చేసింది. అయితే, భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో లభిస్తుందని కంపెనీ ట్విట్టర్ పోస్ట్ తెలిపింది.(చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్)
మోటో జీ 5 జీ స్పెసిఫికేషన్స్
ఈ ఫోన్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. దీనిని మైక్రో ఎస్ డీ కార్డ్ 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సెన్సార్లు కూడా ఉండనున్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేక బటన్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఎన్ఎఫ్‌సీ సపోర్ట్‌ను కూడా ఇందులో అందించనున్నారు. మోటో జీ 5 జీలో కనెక్టివిటీ కోసం జిపిఎస్, బ్లూటూత్ 5.1, వై-ఫై 802.11ఏసి, యుఎస్ బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీని యొక్క ధరను నేడు లాంచ్ ఈవెంట్ లో తెలియజేయనున్నారు.
మోటో జీ 5జీ లాంచ్ నేడే
Published Mon, Nov 30 2020 11:13 AM | Last Updated on Mon, Nov 30 2020 11:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment