దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూజర్లకు ఉచితంగా 11జీబీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎయిర్‌టెల్ కొత్త 4జీ కస్టమర్లకు లేదా 4జీకి అప్‌గ్రేడ్ అయ్యే వినియోగదారులకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. (చదవండి: సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేయకండి)
టెలికాం దిగ్గజం కొత్త ఎయిర్‌టెల్ 4జీ కస్టమర్లకు అందించే 5 జీబీ ఉచిత డేటాను పొందాలంటే యూజర్లు ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎయిర్‌టెల్ కొత్త 4జీ కొనుగోలు చేసిన లేదా 4జీకి అప్ గ్రేడ్ అయ్యి ఉంటే, మీరు మీ కొత్త మొబైల్ నంబర్‌తో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ 5 జీబీ ఉచిత డేటాను1 జీబీ కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ డేటా అనేది 72 గంటల్లో కొత్త 4జీ కస్టమర్ ఖాతాకు ఈ డేటా జమ అవుతుంది. ఉచిత 5జీబీ డేటాను పొందడానికి మీరు కొత్త మొబైల్ నంబర్‌ను యాక్టివేట్ చేసిన 30 రోజుల్లోపు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఐదు కూపన్లు వస్తే యాప్‌లోని మై కూపన్స్ సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1జీబీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రిడీమ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోకుంటే 5జీబీ డేటాకు బదులు 2జీబీ డేటా వస్తుంది.
అలాగే ఎయిర్‌టెల్ తన వినియోగదారులు ఎవరైతే అన్‌లిమిటెడ్ ప్యాకేజీని తీసుకుంటారో వారికీ ఉచితంగా 6జీబీ డేటా వరకు అందిస్తుంది. 84 రోజుల కాలపరిమితితో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీని ఎంచుకునే కస్టమర్లకు 6జీబీ డేటాని ఉచితంగా ఇస్తుంది. ఇది కూడా ఒకే సారి లభించదు. ఈ 6జీబీ డేటా కూడా కూపన్ల రూపంలో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment