
ఈ మధ్యకాలంలో లేట్‌నైట్ పార్టీలు, పబ్ కల్చర్ మితిమీరుతోంది. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాల్సిందే అనేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు లేట్‌నైట్ పార్టీల్లో చిందేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, సింగర్ గరిమా జైన్‌కు ముంబైలోని పబ్‌లో ఊహించని షాక్ తగిలింది. వివరాల ప్రకారం ఏప్రిల్2న వీకెండ్ పార్టీ కోసం ముంబై ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లో ఉన్న పబ్‌కు వెళ్లిన గరిమా పార్టీలో బాగా ఎంజాయ్ చేసింది.
తెల్లవారుజామున 3.15నిమిషాలకు అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో తన ఫోన్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించింది. వెంటనే పబ్ నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరిగి పబ్‌కి వెళ్లి ఎంత దొరికినా తన ఫోన్ కనిపించలేదంటూ వాపోయింది. ఆ ఫోన్ ధర సుమారు లక్ష రూపాయల దాకా ఉంటుందని పేర్కొంది. గరిమా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గరిమా ఇటీవలే రాణి ముఖర్జీ లీడ్ రోల్‌లో నటించిన మర్‌దాని 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment