వెబ్ తెర మీద వెలిగిపోతున్న తార.. గరిమా జైన్
తొలి చిత్రంతోనే స్టార్స్‌గా మారినవాళ్లెందరో.. సినిమాలతో గుర్తింపు రాకపోయినా వెబ్ తెర మీద వెలిగిపోతున్న తారలూ అందరే! రెండో కోవలోకి చెందిన నటే గరిమా జైన్. ఆమె పరిచయమే ఇది..
►గరిమా జైన్ జన్మస్థలం మధ్యప్రదేశ్.
►పీఐఎమ్ఆర్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందిన వెంటనే నేరుగా మోడలింగ్ వైపు నడిచింది.
►ముంబైలోని ఓ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంది.
►ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఆడిషన్స్ అటెండ్ అయ్యేది. సుమారు రెండు సంవత్సరాల ప్రయత్న ఫలితంగా 2015లో ఓ టీవీ సీరియల్లో.. చిన్న పాత్రలో నటించే అవకాశం దొరికింది.
►దురదృష్టవశాత్తు ఆ బుల్లిపాత్ర ఎడిటింగ్‌కు బలి అయింది.
►మొదటి అవకాశంలో కనబర్చిన తన నటన ప్రేక్షకుల కంటికి కనిపించలేకపోయినా, దర్శకుల దృష్టిలో పడింది.
►ఒకేసారి ‘శక్తి’, ‘ఈ– లవ్’ సీరియల్స్‌లో నటించడంతో పాటు ‘మర్దానీ –2’ సినిమాలో చాన్స్ కూడా కొట్టేసింది. ‘మర్దానీ –2’ సినిమా మంచి విజయం సాధించింది.
►2020లో ‘గందీ బాత్ 4’తో వెబ్ దునియాలోకి అడుగు పెట్టి, ‘ఎక్స్ఎక్స్ఎక్స్–2’, ‘ట్విస్టెడ్–3’ సిరీస్‌లతో అలరించింది.
►ఆమె తెలుగులో నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ త్వరలోనే విడుదల కానుంది.
నా కష్టమే నన్ను బ్యాక్ టు బ్యాక్ సిరీస్, సినిమాలతో బిజీగా ఉంచింది. ఎప్పటికైనా కష్టపడేవారికే ఫలితం దక్కాలి, దక్కుతుంది. – గరిమా జైన్.