
సాక్షి, సైదాపూర్(కరీంనగర్): తక్కువ ధరకే మొబైల్ అన్నారు.. రూ.1,500 చెల్లించాక పార్శిల్‌లో మట్టి పెల్ల పంపిన ఘటన సైదాపూర్ మండలంలోని జాగీర్‌పల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల క్రితం జాగీర్‌పల్లికి చెందిన సిలివేరు అజయ్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఆఫర్ వచ్చిందని చెప్పారు.
రూ.1,500కే రూ.12 వేల విలువైన ఫోన్ మీ సొంతమన్నారు. అది నమ్మిన అజయ్ పోస్టాఫీసుకు వెళ్లి, డబ్బులు చెల్లించి, పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చి, ఓపెన్ చేస్తే, అందులో ఒక పవర్ బ్యాంకు, ఒక మట్టి పెల్ల ఉండటంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
చదవండి: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment