
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై: ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నంలో ఆరో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఓ 16 ఏళ్ల బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. పోలీసుల కథనం మేరకు పశ్చిమ అంధేరీ వర్సోవా ప్రాంతంలోని ఓ భవనం ఆరో అంతస్తులో తల్లిదండ్రులు, సోదరి, సోదరునితో కలిసి నివాసముంటున్న 16 ఏళ్ల బాలిక తరు చూ ఢిల్లీలో ఉంటున్న మిత్రుడితో సెల్ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఈ విషయాన్ని గమ నించిన సోదరి మందలించింది. తరువాత తల్లిదండ్రులు కూడా తీవ్రంగా మందలించారు.
చదవండి: దారుణం: ఇద్దరి పిల్లలకు విషమిచ్చి.. ఆపై ఉరేసుకున్న తండ్రి
అయినప్పటికీ ఆమెలో మార్పురాలేదు. రహస్యంగా స్నేహితునితో మాట్లాడేది. ఈ క్రమంలోనే మళ్లీ మిత్రుడితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా సోదరి గమనించింది. దీంతో సోదరి తనను మందలిస్తుందన్న భయంతో ఏకంగా ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయం తీసుకుంది. బెడ్‌రూమ్ డోరు మూసివేసింది. నాలుగైదు చీరలను ముడివేసి వీటి సాయంతో బాల్కని నుంచి కిందికి దిగి పారిపోవాలని ప్రయత్నం చేసింది. అయితే చీర సాయంతో కిందకు దిగే ప్రయత్నంలో అదుపు తప్పి నేరుగా నేలపై పడిపోయింది. తీవ్రగాయాలైన బాలికను వెంటనే స్ధానిక కూపర్ ఆస్పత్రిలో చేర్పించారు.
చదవండి: వివాహేతర సంబంధం.. శరీరం నుంచి తలను వేరుచేసి..
Comments
Please login to add a commentAdd a comment