
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైసూరు(కర్ణాటక): నివాస ధ్రువీకరణ పత్రం కోసం పాలికె కార్యాలయానికి వెళ్లిన మహిళతో అధికారి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. శారదాదేవీ నగరలో పాలికె జోన్ కార్యాలయంలో విషకంఠేగౌడ అనే అధికారిని నివాస ధ్రువీకరణ పత్రం కోసం మహిళ అడగ్గా, అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మహిళ కోపం పట్టలేక చేతితో నాలుగు దెబ్బలు బాదడంతో అధికారి కంగుతిన్నాడు. అక్కడే ఉండే ఎవరో ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సరస్వతిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
గొంతుకు కేబుల్ బిగించి మహిళ హత్య
బనశంకరి: అనేకల్ తాలూకాలోని వినాయకగరలో నివాసం ఉంటున్న నాగవేణి(45) అనే మహిళ బుధవారం హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుకు కేబుల్‌వైర్ బిగించి హత్య చేశారు. అనేకల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆనేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తెలిసినవారే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment