
సాక్షి, ముంబై: లాక్ డౌన్ సడలింపులతో ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్ లైన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత ప్రముఖ మొబైల్ తయారీదారు శాంసంగ్ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించింది. లాక్‌డౌన్ తర్వాత స్మార్ట్‌ఫోన్ విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ప్రీ బుకింగ్స్‌పై ఇ-వోచర్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. పరిమిత కాల ఆఫర్ రూ.4 వేల విలువ చేసే వోచర్ అందిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. భారత్‌లో గెలాక్సీ ఎస్20 సిరీస్ కోసం శాంసంగ్ ప్రీబుకింగ్స్ ప్రారంభించిన సందర్బంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్ అందుబాటులో వుంచింది. ఈ వోచర్‌లను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ శామ్‌సంగ్.కామ్‌లో లభించే ఇతర గెలాక్సీ ఉత్పత్తుల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. ఈ నెల (మే) 20 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది.
గెలాక్సీఎస్ 20 ఫోన్లను ప్రీ-బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్‌ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. గెలాక్సీ ఎస్ 20ప్లస్, ఎస్ 20 అల్ట్రా ప్రీ-బుకింగ్ చేసుకునే వినియోగదారులకు రూ.11,990 విలువైన గెలాక్సీ బడ్స్ ప్లస్‌ను కేవలం రూ.1,999కే పొందవచ్చు. అలాగే గెలాక్సీ ఎస్ 20 ప్రీ-బుకింగ్ వినియోగదారులు గెలాక్సీ బడ్స్ ప్లస్ ను రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ను జూన్ 15 లోపు మాత్రమే రిడీమ్ చేసుకోవాల్సి వుంటుంది. వీటితోపాటు కొనుగోలుదారులకు శాంసంగ్ కేర్ + రూ .3,999 విలువైన 1,999 లాంటి ఆఫర్లను శాంసంగ్ ప్రకటించింది.
జూన్ 15 వరకు రిడీమ్ చేసుకునేలా అనేక ఇతర ఆఫర్లను శాంసంగ్ ప్రకటించింది. ‘గెలాక్సీ ఎస్ 20’ని ప్రీ-బుక్ చేసుకునే వినియోగదారులు అప్‌గ్రేడ్ ఆఫర్‌తో అదనంగా రూ. 5000 బోనస్ అందిస్తోంది. ‘గెలాక్సీ ఎస్ 20’, ‘గెలాక్సీ ఎస్ 20 ప్లస్’, ‘గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా’ ప్రీ-బుకింగ్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాదు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై రూ.6 వేల క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం.
గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా
6.9 అంగుళాల భారీ డిస్ ప్లే, 1440x3200 పిక్సెల్స్ రిజల్యూషన్ (ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ స్క్రీన్) ,108 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్,48 ఎంపీ టెలిఫోటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ టోఫ్ లెన్స్ రియర్ కెమెరా, 40 ఎంపీ సెల్పీ కెమెరా లను అమర్చింది. ముఖ్యంగా ఈ కెమెరాల్లో 100ఎక్స్ సూపర్ రిజల్యూషన్ జూమ్, ఇంకా 5జీ, ఇన్ డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.