
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. మొదట ఈ సేల్‌ను జూన్ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్ కారణంగా ప్రైమ్ డే సేల్ వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్ డే సేల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో డిస్కౌంట్ వచ్చే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను అమెజాన్ విడుదల చేసింది. డిస్కౌంట్ ధరలతో లభించే వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5 జి, రెడ్‌మి నోట్ 10 ఎస్, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, ఐఫోన్ 11 వన్‌ప్లస్ 9 ఆర్ 5 జి, రెడ్‌మి నోట్ 10 ఫోన్లను అమెజాన్ ప్రకటించింది. ఐఫోన్ 12 ప్రో, శామ్‌సంగ్ నోట్ 20, ఎంఐ 11 ఎక్స్ 5 జి, ఎంఐ 10 ఐ 5 జి, ఐక్యూ 7 లెజెండ్ వంటి ఫోన్లపై కూడా డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఈ మొబైళ్ల ధరలను అమెజాన్ పూర్తిగా వెల్లడించలేదు. ప్రైమ్ డే సేల్‌లో సుమారు 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొబైళ్లపై డిస్కౌంట్ ఆఫర్లను సేల్‌కు రెండురోజుల ముందు ప్రైమ్ మెంబర్స్‌కు అందుబాటులో ఉంచనుంది
Comments
Please login to add a commentAdd a comment