సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఇండియాలలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా కొత్త వ్యూహాలు రచిస్తోంది. తన పెట్టుబడులను ఇతర దేశాలనుంచి ఇండియాకు తరలించేందుకు యోచిస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ)పథకం కింద స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని మరింత విస్తృతం చేయనుంది.ఈ మేరకు ఒక అంచనాను కూడా ప్రభుత్వానికి సమర్పించిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. (షావోమికి షాకిచ్చిన శాంసంగ్)
స్మార్ట్ ఫోన్ ఉత్పత్తికి సంబంధించి వియత్నాం, సహా ఇతర దేశాల నుండి తన పెట్టుబడులు ఇటువైపు మళ్ళించనుంది. దేశంలో 40 బిలియన్ డాలర్లు లేదా 3 లక్షల కోట్ల రూపాయల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలను రచిస్తోంది. ముఖ్యంగా రానున్న అయిదేళ్లలో15వేల రూపాయల కంటే తక్కువ ధర ఉంటే ఫోన్‌లను ఉత్పత్తి చేయనుంది. వీటి 25 బిలియన్ డాలర్లకు పైగా ఉండనుంది ఈ కేటగిరీలోని చాలా ఫోన్‌లను ఎగుమతి చేయనుంది. పీఎల్‌ఐ పథకానికి దేశీయ, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారుల భారీ ఆదరణ లభించిందనీ కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రకటించారు. మొత్తం 22 కంపెనీలు ముందుకువచ్చాయని వెల్లడించారు.అంతర్జాతీయతయారీ సంస్థలు ఆపిల్,శాంసంగ్ తోపాటు, దేశీయంగా లావా, మైక్రోమాక్స్, ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో కంపెనీలు ముందుకురావడం సంతోష దాయకమని వెల్లడించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ స్మార్ట్ఫోన్ ఎగుమతి మార్కెట్ 270 బిలియన్ డాలర్లుగా అంచనా. వీటిలో ఆపిల్ 38 శాతం మార్కెట్ వాటా, శాంసంగ్ వాటా 22 శాతం. వాల్యూమ్ విషయానికి వస్తే, శాంసంగ్ 20 శాతం సొంతం చేసుకోగా, ఆపిల్ వాటా 14 శాతం.
కాగా శాంసంగ్ తన ఫోన్లలో దాదాపు50 శాతం వియత్నాంలో ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ కొరియాలో కార్మిక ఖర్చులు భారీగా ఉండంటంతో దేశంలో తయారీని దాదాపు మూసివేసే ప్రక్రియలో ఉంది. వియత్నాంతోపాటు, బ్రెజిల్ ఇండోనేషియాలో కూడా శాంసంగ్ ఉత్సత్తి యూనిట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment