‘నెట్’లో పడకండి | Beware of Cyber Net | Sakshi
Sakshi News home page

‘నెట్’లో పడకండి

Published Tue, Oct 8 2013 1:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

‘నెట్’లో పడకండి

‘నెట్’లో పడకండి

 సైబర్ నేరగాళ్ల విజృంభణపై పోలీసుల హెచ్చరిక.. జాగ్రత్తలు
 సాక్షి, సిటీబ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంతో లక్షల్లో కొల్లగొడుతున్న నేరాలు నగరంలో ఇటీవల గణనీయంగా పెరిగాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్‌కు రోజూ గరిష్టంగా 10 ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో, ‘సైబర్ సేఫ్ సిటీ’ కోసం డిటెక్టివ్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు.  డిప్యూటీ పోలీసు కమిషనర్ లేళ్ల కాళిదాస్ వేంకట రంగారావు సోమవారం ఈ కార్యక్రవూన్ని ఆవిష్కరించారు. సైబర్ నేరాలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ‘నెట్ జనులు’  తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
 
 ఆధునిక పంథాలో అకౌంట్ టేకోవర్...
 ఇటీవల ఎక్కువగా నమోదయ్యే నేరాలు అకౌంట్ టేకోవర్‌కు సంబంధించినవే. ఈ సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈ-మెరుుల్స్‌ను హ్యాక్ చేస్తారు. అన్ సెక్యూర్డ్ ఈ-మెరుుల్ ఐడీల లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. అదును చూసుకుని.. నగదు చెల్లించాల్సిన వ్యక్తికి, నగదు తీసుకునే వ్యక్తిలా మెయిల్ పంపిస్తారు. బ్యాంక్ ఖాతా మారిందంటూ తమ ఖాతాను మెరుుల్‌లో పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకి వస్తారుు. అందుకే.. ఖాతాలు మారినట్టుగా సమాచారం వస్తే అవతలి వ్యక్తిని నేరుగా సంప్రదించి నిర్ధారించుకున్న తరవాతే డిపాజిట్ చేయుడం ఉత్తమం.
 
 ఆశపడ్డారో... అంతే సంగతులు...: సినివూ హాళ్లు, షాపింగ్ వూల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నావుని నవ్ముబలుకుతుంటారు. ఈ-మెరుుల్ ఐడీ, సెల్‌ఫోన్ నెంబరు రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహువుతి ఇస్తావుని కూడా ఆశపెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే, ఇబ్బందే. వారి దగ్గరనుంచి, ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు  కొనేసి, తవు పని కానిస్తుంటారు.
 
 ఒక్క మెరుుల్‌తో ఖాతా ఖాళీ...: మేం ఫలానా బ్యాంకు నుంచి మెరుుల్ చేస్తున్నాం... భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలూ తనిఖీ చేస్తున్నాం. మీ అకౌంట్ నెంబర్, పాస్‌వర్డ్ చెప్తే ఎవరూ టాంపర్ చేయుకుండా చర్యలు తీసుకుంటాం... అంటూ వచ్చే ఈ-మెరుుల్‌కు స్పందించారో మీ ఖాతా ఖాళీ అరుుపోరుునట్లే. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా 98లక్షల ఫిషింగ్ మెరుుల్స్ పంపుతున్నట్లు అంచనా. ఇక ఎస్‌ఎమ్మెస్‌లో ఇలా వచ్చే సందేశాన్ని స్మిషింగ్ అంటారు.
 
 కీ లాగర్స్...: కంప్యూటర్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీని తెలుసుకునేందుకు కీ లాగర్స్ అనే సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు. కంప్యూటర్‌ను వినియోగించిన వారు ఏ సవూచారం టైప్ చేశారో ఈ సాఫ్ట్‌వేర్‌తో తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్‌ల్లోని సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనితో కంప్యూటర్‌ను వాడుకున్న వారు టైప్ చేసిన సవూచారాన్ని తస్కరించి దుర్వినియోగం చేసే వాళ్లు పెరిగారు.
 
 క్రెడిట్ కార్డుతో జాగ్రత్త...: షాపు లేదా పెట్రోల్ బంక్ కు వెళ్లి, క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించినపుడు కార్డు చెల్లింపు సవూచారానికి చెందిన ఒక కాపీ వారే ఉంచుకుంటారు. వారి దగ్గర ఉంచుకునే బిల్లు కాపీలో వున పేరు, కార్డు నెంబరు ఉంటారుు. కార్డు వెనుక ఉన్న సీవీవీ కోడ్‌ను అవతలి వ్యక్తులు నోట్ చేసుకుంటే.. నెట్‌లో మీ ఖాతాతో వారు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి స్కివ్ముర్లను వినియోగించి కార్డు డేటాను దొంగిలించి, వురో కార్డు తయూరు చేసి జల్సా చేస్తున్నారు.
 
 భారీస్థారుులో అవగాహన: రంగారావు
 సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కోసం భారీస్థారుులో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీసీఎస్ డీసీపీ రంగారావు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులను పట్టుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రవుం దోహదపడుతుందన్నారు. కార్యక్రవు వివరాలను ఆయున తెలిపారు. హోటళ్లు, కాలేజీలు, పెట్రోల్ బంకులు, మాల్స్ వంటి ప్రాంతాల్లో... సైబర్ నేరాలపై అవగాహనకు దాదాపు 50 వేల కరపత్రాలు, వాల్‌పోస్టర్లను ముద్రించారు.  పోలీసుస్టేషన్ల వారీగా వాటిని పంపిణీ చేయిస్తారు.  సోషల్‌మీడియాను వినియోగించే యుువతకు ఈ నేరాలపై  ప్రస్తుతానికి ట్రాఫిక్ పోలీసు ఫేస్‌బుక్ ద్వారా అవగాహన కల్పిస్తారు. సీసీఎస్ ఆధీనంలో కొత్త ఫేస్‌బుక్ పేజ్ ద్వారా కూడా అవగాహన కల్పిస్తారు. ట్రాఫిక్ డిజిటల్ సైన్ బోర్డులలో కూడా సైబర్ క్రైమ్ అలెర్ట్స్‌ను ప్రసారం చేయునున్నారు. సైబర్ నేరాలపై అవగాహనకోసం సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సెల్‌ఫోన్ వినియోగదారులకూ  సంక్షిప్త సందేశాలు పంపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement