టెక్నాలజీతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వల్లే అభివృద్ధి, పారదర్శకత సాధ్యమని సీఎం ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. టెక్నాలజీ వినియోగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మంగళగిరి ఆటోనగర్‌లో పదెక రాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా తాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మమేకమయ్యానని చెప్పారు.
ఆగస్టు 3న మంత్రివర్గ సమావేశం: రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 3న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాత్కాలిక సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.