ఎంఎస్‌ఎంఈలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సబ్సిడీ | Govt proposes subsidy for MSMEs deploying cloud computing | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సబ్సిడీ

Published Mon, Mar 13 2017 4:42 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

ఎంఎస్‌ఎంఈలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సబ్సిడీ

ఎంఎస్‌ఎంఈలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సబ్సిడీ

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్‌ఎంఈ)లు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ సేవలను అందిపుచ్చుకునేందుకు వీలుగా వాటికి రూ.లక్ష వరకు సబ్సిడీ ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో భాగంగా ఎంఎస్‌ఎంఈలు ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ తదితర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. రెండేళ్లపాటు ఈ సేవల యూజర్‌ చార్జీలపై సబ్సిడీ అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. తొలుత ఈ చార్జీలను ఎంఎస్‌ఎంఈలు తామే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుంది. ‘ఎంఎస్‌ఎంఈ రంగంలో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ప్రోత్సాహం’ అనే పథకానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పొందుపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement