'ఐటీ రంగానికి హైదరాబాదే బెస్ట్'
హైదరాబాద్: ఐటీ రంగానికి హైదరాబాద్ నగరమే అనుకూలమైన ప్రాంతమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో విస్ర్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీ రంగానికి హైదరాబాద్ నగఈ నెల 29వ తేదీన జరిగే సకల జనుల భేరీని విజయవంతం చేయాల్సిందిగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల పెట్టేందుకు హైదరాబాద్ అనుకూలమైనదని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌ను యూటీ అని కిరికిరి చేస్తే యుద్ధమేనని టీఆర్‌ఎస్ అధినేత శనివారం కేసీఆర్ ఓయూ జేఏసీ నేతలతో వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించాలనే ప్రతిపాదనతో ఓయూ జేఏసీ నేతలు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. అయితే.. అక్టోబర్ మొదటి వారంలోనే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముందని, ఆ తరువాతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయించుకుందామని కేసీఆర్ సూచించారు. ‘ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతనే ఉద్యమ కార్యాచరణపై మాట్లాడుకుందాం. ఎవరెన్ని ప్రయత్నాలు, కుట్రలు చేసినా 10 జిల్లాలతోనే తెలంగాణ వస్తుందనుకుంటున్నా.