హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స కీర్తివాణి, నర్సమ్మ అనే చిన్నారులు చనిపోయారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
పేలుడు జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు, 108కి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరిగిన సమయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు వంట చేయబోయి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. పేలుడుకు రసాయనాలు కారణమని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. బాధిత కుటుంబం శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చిందని పోలీసులు తెలిపారు.
జవహర్నగర్ పేలుడు ఘటనలో ఇద్దరి మృతి
Published Fri, Dec 12 2014 3:33 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement
Advertisement