సంబురాలు షురూ!
జవహర్‌నగర్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు జిల్లాలో షురూ అయ్యాయి. పాఠశాలల్లో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలతో.. వివిధ రకాల పూలను తెచ్చి బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం స్కూలు ఆవరణలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఉపాధ్యాయులు బతుకమ్మపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు.