
ఘటనా స్థలంలో స్థానికులు
సాక్షి, హైదరాబాద్: ఒకేచోట మూడు మృతదేహాలు వెలుగు చూసిన ఘటన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కలకలం రేపింది. డెంటల్ కాలేజ్ డంపింగ్ ర్డ్ సమీపంలో మర్రి చెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలతో పాటు చెట్టు పక్కనే మరో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మూడు మృతదేహాలు ఒకేచోట ఉండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్‌తో జనమంతా ఇళ్లకు పరిమితమైన వేళ ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇది చదవండి: బోర్ కొడుతుందని ఫ్రెండ్‌ని సూట్‌కేసులో..
Comments
Please login to add a commentAdd a comment