Man Assaults Woman On Road At Jawahar Nagar PS Limits - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు

Published Mon, Aug 7 2023 9:37 AM | Last Updated on Mon, Aug 7 2023 1:00 PM

Man Assault Woman On Road At Jwahar Nagar PS Limits - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: జవహార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలాజీ నగర్‌ బస్టాండ్‌ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఓ కీచకుడు వివస్త్రను చేశాడు. పెద్దమారయ్య (30) అనే కూలీ తాగిన మత్తులో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె బట్టలు చింపేసి అందరి ముందు పరువు తీశాడు.

అడ్డుచ్చిన వారిపై సైతం దాడికి తెగబడ్డాడు దుర్మార్గుడు. దీంతో 15 నిముషాల పాటు యువతి రోడ్డుమీద నగ్నంగా ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. మారయ్య అక్కడి నుంచి వెళ్లాక పలువురు కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి, మారయ్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement