ఇద్దరు మహిళల దారుణ హత్య | two unknown womens murderd in rangareddy district | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళల దారుణ హత్య

Published Fri, Jun 24 2016 5:08 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

two unknown womens murderd in rangareddy district

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కౌకూర్ గ్రామంలోని వెంకూష ఎస్టేట్ పక్కనున్న ఖాళీ ప్రదేశంలో సగం కాలిన గుర్తు తెలియని మహిళల మృతదేహాలను స్థానికులు శుక్రవారం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుర్తు తెలియని దుండగులు ఆ మహిళల గొంతుకోసి కాల్చివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మృతులను సెక్స్‌వర్కర్లుగా పోలీసులు భావిస్తున్నారు. సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement