మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సంవత్సరం ఆంధ్ర, ఒడిశా బోర్డర్ లో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్‌లో ప్రభాకర్ అనే మావోయిస్టు మృతి చెందాడు. ప్రభాకర్‌ను స్మరించుకుంటూ అతని కుటుంబం నివాసం ఉండే యాప్రాల్ లో అభిమానులు స్థూపాన్ని కట్టేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
ఇది తెలిసి అక్కడికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ ఏడుగురూ ఠాణాలోనే ఆందోళనకి దిగటంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.