
మమ్మీ.. చెల్లి జాగ్రత్త..!
* కుక్క మోనును జాగ్రత్తగా చూసుకోండి
* నా చావుకు ఎవరూ బాధ్యులు కారు
* సూసైడ్‌నోట్ రాసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: ‘మమ్మీ, డాడీ.. చెల్లి జాగ్రత్త.. నా కుక్క ‘మోను’ను బాగా చూసుకోండి, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో గురువారం జరిగింది. అల్వాల్ ఎస్‌ఐ వెంకన్న, స్థానికులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన నేవీ విశ్రాంత ఉద్యోగి సూర్య క్రాంతం, విజయలక్ష్మి దంపతులు 20 ఏళ్లుగా జవహర్‌నగర్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి కూతుళ్లు సునీత (26),హేమలత ఉన్నారు. సునీత ఏఎస్ రావు నగర్‌లోని ఇరిటెల్ సైబర్ టెక్ కంపెనీలో మూడేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
ఇటీవల సునీతకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గురువారం తనకు ఆరోగ్యం బాగాలేదని సునీత ఇంట్లోనే ఉండిపోయారు. క్రాంతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండడంతో విధులకు వెళ్లిపోయారు. విజయలక్ష్మి చిన్నకూతురు హేమలతను తీసుకొని షాపింగ్‌కు వెళ్లారు. అనంతరం తల్లీకూతుళ్లు మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటికి రాగా సీలింగ్‌కు సునీత విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సునీత ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఓ గ్లాస్‌లో నలుపురంగు ద్రవం ఉంది. ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లెటర్‌లో ‘మమ్మీ, డాడీ.. చెల్లి జాగ్రత్త. కుక్క మోనును సరిగా చూసుకోండి, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అని ఇంగ్లిష్‌లో ఉంది.
సునీత సెల్‌ఫోన్‌కు ‘వేర్ ఆర్ యూ’ అని ఉదయం 11 గంటలకు ఓ మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఆమె కాల్‌డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ప్రేమ వ్యవహారం ఆత్మహత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.