ప్రేమ పేరుతో వంచన | Man cheats lover | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచన

May 27 2016 8:24 PM | Updated on Mar 28 2018 11:26 AM

తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి జవహర్ నగర్ పోలీసులను శుక్రవారం ఆశ్రయించింది.

జవహర్ నగర్ (రంగారెడ్డి జిల్లా) : తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి జవహర్ నగర్ పోలీసులను శుక్రవారం ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడ భవానీ నగర్‌కు చెందిన ఓ యువతిని అదే ఊరుకు చెందిన నరేష్(22) అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. తీరా పెళ్లి విషయం అడిగితే.. నీకు నాకు సంబంధం లేదని చేతులెత్తేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని యువతి అభ్యర్థించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement