
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న యువతిని వివస్త్రను చేసి, దాడికి పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జవహర్‌నగర్ డీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్ శివాజీనగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు.
ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన మారయ్య తన తల్లితో కలిసి బాలాజీనగర్ డివైడర్ మార్గంలో రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో షాపింగ్‌కు వెళ్లి వస్తున్న ఓ యువతి (28)పై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మారయ్య చెంప చెళ్లుమనిపించింది. దీంతో అతను కోపంతో ఆమెపై దాడి చేసి దుస్తులు లాగి వివస్త్రను చేశాడు. పక్కనే ఉన్న మారయ్య తల్లి కుమారుడిని వారించలేదు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ అడ్డుకోగా ఆమెపై కూడా దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత పలువురు మహిళలు వచ్చి ఆమెపై కవర్లను కప్పారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేస్తుంటే స్థానికులు సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు తప్ప అడ్డుకోలేదని పలువురు మండిపడుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment