ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విపక్ష కూటమి ఇండియా(INDIA) లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
మణిపూర్ అంశంపై ప్రధాని ప్రసంగంపై కేంద్రం వెనకడుగు వేస్తున్న వేళ.. విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం మళ్లీ కుదిపేసింది. ఈ క్రమంలో విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాతే విపక్ష కూటమి అవిశ్వాసం దిశగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మణిపూర్ అంశంతో రాజ్యసభలోనూ గందరగోళం నెలకొనగా.. వాయిదా పడింది.
ప్రధాని సెటైర్లు..
ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రానా(విపక్షాల) వారి తీరు మారుతుందా? అంటూ ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి దిశ దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన.. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్‌లోనూ ఇండియా అనే పదం ఉందంటూ సెటైర్లు వేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment