oppostion parties
-
పార్లమెంట్ ను కుదిపేస్తున్న మణిపూర్ అంశం
-
ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం?
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విపక్ష కూటమి ఇండియా(INDIA) లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రసంగంపై కేంద్రం వెనకడుగు వేస్తున్న వేళ.. విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం మళ్లీ కుదిపేసింది. ఈ క్రమంలో విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాతే విపక్ష కూటమి అవిశ్వాసం దిశగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మణిపూర్ అంశంతో రాజ్యసభలోనూ గందరగోళం నెలకొనగా.. వాయిదా పడింది. ప్రధాని సెటైర్లు.. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రానా(విపక్షాల) వారి తీరు మారుతుందా? అంటూ ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి దిశ దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన.. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్లోనూ ఇండియా అనే పదం ఉందంటూ సెటైర్లు వేసినట్లు సమాచారం. -
వారి విమర్శలు అర్థం లేనివి: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతలో భాగంగా ప్రార్థనాలయాలకు జరిగిన నష్టంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. నల్లపోచమ్మ ఆలయం, మసీదులను కొత్తగా నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తరువాత కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడాలి: యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ట్విటర్లో విమర్శించారు. ఆయన ట్విటర్ వేదికగా స్వందిస్తూ.. వలస కార్మికులు, పేద ప్రజల సమస్యలు ప్రభుత్వానికి కనబడడం, వినబడడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. విపక్ష పార్టీలు కేవలం సలహాలు ఇవ్వడానికే పరమితమవుతున్నాయని.. సమస్యలు పరిష్కారానికి అన్ని పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. వలస కూలీలను స్వస్ధలాలకు పంపేందుకు వారికి సాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్ చేస్తూ మే 18న యశ్వంత్ సిన్హా నిరసనకు దిగారు. గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై యశ్వంత్ సిన్హా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీని మోసపూరిత ప్యాకేజీగా యశ్వంత్ సిన్హా అభివర్ణించిన విషయం విదితమే. చదవండి: లేదంటే జనాల్లో నమ్మకం కోల్పోతారు : యశ్వత్ సిన్హా Opposition parties shd hit the streets instead of petitioning the govt which is deaf and blind to the suffering of the poor. Mere statementbazi will not suffice any more. — Yashwant Sinha (@YashwantSinha) May 23, 2020 -
కోటాపై వాగ్యుద్ధం
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వాలే నిర్ణయిస్తాయంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించిన కేసులో తాము కక్షిదారు కాదని కేంద్రం స్పష్టం చేసింది. రిజర్వేషన్ విధానాన్ని పరిరక్షించడంలో కేంద్రం విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో లోక్‌సభలో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ సోమవారం సభలో.. ‘ఎస్సీ, ఎస్టీలోపాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో అఫిడవిట్ వేయాలని సుప్రీం కోరలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. 2012లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి’అని ఆరోపించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సిగ్గు, సిగ్గు అని నినాదాలు చేసుకుంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు, ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఈ విషయాన్ని లేవనెత్తారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పేందుకు ఎన్నో ఆధారాలున్నాయని డీఎంకే సభ్యుడు ఎ.రాజా, బీఎస్పీ నేత రితేశ్ పాండే వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సీపీఎం నేత ఏఎం అరీఫ్ ప్రభుత్వాన్ని కోరారు. మరో వైపు రాజ్యసభలో... అసమర్థులైన వైద్యుల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉందని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. సోమవారం సభలో ఆయన వార్షిక బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ.. పెరుగుతున్న నిరుద్యోగిత, పడిపోతున్న వినియోగం అనే రెండు సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుండగా ప్రభుత్వం మాత్రం ఖండించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ‘అన్ని రకాల పన్ను వసూళ్లు మందగించాయి. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ..ఇంకా గత పాలకులను ఎలా విమర్శిస్తుంది? అని అన్నారు. -
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: ఇండియా–పాకిస్తాన్, హిందూ–ముస్లిం అనడం.. చలికాచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా బీజేపీ దగ్గర లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు విమర్శించారు. బీజేపీ నేతలకు మత రాజకీయాలు తప్ప దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని లేదన్నారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు. రైతుబంధు, రైతుభరోసా, విద్యార్థులకు సన్నబియ్యపు భోజనం, కల్యాణలక్ష్మీ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరమైపోయిందని, అందుకే ఏ ఎన్నికైనా టీఆర్ఎస్సే గెలుస్తోందన్నారు. టీఆర్ఎస్ వరుస విజయాలతో కాంగ్రెస్, బీజేపీలకు మతిపోయిందని అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున గెలిచిన 8 మంది కౌన్సిలర్లు టీడీపీ నేత గణేశ్ గుప్తా నేతృత్వంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అడ్డిమారి గుడ్డిదెబ్బలా 4 సీట్లు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పేరుకే జాతీయ పార్టీలని, వాటికి నీతి, నిజాయితీ, సిద్ధాంతం లేదని కేటీఆర్ మండిపడ్డారు. అడ్డిమారి గుడ్డిదెబ్బ లాగా బీజేపీ రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలవడంతో లక్ష్మణ్ రోజూ ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌ను తిట్టే పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రంలో గెలవాలంటే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి జాతీయ హోదా నిధులు తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇది చేతకావడం లేదన్నారు. ఫార్మాసిటీ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి నిధులు, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా నయాపైసా కేటాయించలేదని తెలి పారు. బీజేపీ కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన అన్నిసార్లూ రాష్ట్రానికి అన్యాయమే చేసిందని మండిపడ్డారు. 3 పురపాలికల కోసం కాంగ్రెస్, బీజేపీ పొత్తు.. కాంగ్రెస్, బీజేపీలు తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి బండ్లగూడ, మణికొండ, నార్సింగ్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాల కోసం పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఏం బతుకు అయింది రా.. 3 మున్సిపాలిటీల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చిం దని స్వయంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు విమర్శించారని గుర్తుచేశారు. శంషాబాద్ మున్సిపాలిటీలో 25 వార్డులుంటే 14 వార్డులను టీఆర్ఎస్ గెలిస్తే, 8 వార్డులను గణేశ్ గుప్త నేతృత్వంలోని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుచుకున్నారని, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకే వార్డు మాత్రమే దక్కిందని కేటీఆర్ అన్నారు. 130 పురపాలికలకు ఎన్నికలు జరిగితే 122 పురపాలికలను టీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. మొత్తం 3,148 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 1800–1900 డివిజన్లను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిస్తే, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు, స్వతంత్రులు కలసి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా రెండో స్థానంలో నిలిచారని తెలిపారు. డైలాగులు చెప్పడంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అదరగొడుతున్నా, మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్టీలు కనీసం రెండో స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయాయని ఎద్దేవా చేశారు. 45 శాతం బీసీలకు.. మున్సిపల్ ఎన్నికల్లో 45% సీట్లు బీసీలకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. మహిళలకు 244 చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ స్థానాలు కేటాయించడం ద్వారా వారికి 57% కోటా అమలు చేశామన్నారు. రాజకీయంగా వెనకబడిన వర్గాలకు పదవుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తున్నామని, ఆర్యవైశ్యులకు 11 చైర్పర్సన్ పదవులు కేటాయించామని తెలి పారు. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థ, కోర్టులపై నమ్మకం లేదని ఫలితాల తర్వాత ఉత్తమ్ పేర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించా రు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగిస్తామని, దీంతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ, రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధికి చాలా చేస్తామని హామీ ఇచ్చారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్రం మొండిచేయి చూపిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఏమీ చేయలేదు..ఏమీ చేయబోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి గత ఆరేళ్లలో టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, భవిష్యత్‌లో కూడా ఆ పార్టీ నేతలు ఏమీ చేయబోరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ విషయాలు సీఎం కేసీఆర్‌కు గుర్తుకు రావాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన గురువారం గాంధీభవన్ నుంచి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ వైఫల్యాలను, ప్రజలను మోసం చేసిన తీరును ఎన్నికల ప్రచారంలో ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కు ఓట్లడిగే అర్హత లేదు మూడేళ్లలో మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగబోనని 2014 డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని, నేటికీ నీళ్లివ్వని టీఆర్ఎస్, కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని ఉత్తమ్ అన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, రైతుబంధు, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు తదితర అన్ని అంశాల్లో కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, తెలంగాణలో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని తాము కోరినా సీఎం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని మైనార్టీలు గుర్తించాలని కోరారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కామన్ మేనిఫెస్టో–విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రాలు, శనివారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరించాలని కోరారు. తాము మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ మున్సిపల్ ఎన్నికల్లో అసలు బీజేపీ పోటీలోనే లేదని వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రేపు ( గురువారం) జలవిధానంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో స్క్రీన్ల ఏర్పాటుకు స్పీకర్ మధుసూదనాచారి అనుమతినిచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ గ్యాలరీ ద్వారా ఎమ్మెల్సీలు ప్రజెంటేషన్ వీక్షించేలా మరో స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షాల వైపు, స్పీకర్ వైపు స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహాల్లోనూ ప్రత్యేకంగా ఓ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ నేపథ్యంలో అసెంబ్లీకి ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.