తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అసలు రంగు బయటపడింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తీరు తాజా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో డొల్ల అని తేలింది. ప్రపంచంలో ఏం జరిగినా.. ఆ క్రెడిట్ చంద్రబాబుదేనని చెప్పడంలో ఈనాడు ముందుంటుంది. అందులో భాగంగానే కేంద్రంపై విపక్షాలు అవిశ్వాసం పెట్టగానే.. ఆ క్రెడిట్ తెలుగుదేశందేనని తేల్చేసింది. ఓ వార్తను అచ్చేసింది.
మరి ఈనాడు ఇంతగా జాకీలు పెట్టి లేపినా.. సభలో తెలుగుదేశం సభ్యులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కుర్చీలకే పరిమితమయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో క్రెడిట్ కొట్టేయాలి, ఢిల్లీలో బల్లిలా అతుక్కుపోవాలన్నది టీడీపీ, ఈనాడు సిద్ధాంతంలా కనిపించింది.
చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా?
‘‘టీడీపీ స్ఫూర్తితోనే ‘ఇండియా కూటమి’ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ‘ఈనాడు’ చెప్పింది. మరి తీర్మానానికి మద్దతుగా టీడీపీ సభ్యులు పార్లమెంట్‌లో ఎందుకు లేచి నిలబడలేదో టీడీపీ కానీ, చంద్రబాబు కానీ, రామోజీ కానీ సమాధానం చెప్పాలి’’ అంటూ ఈనాడు వార్త, టీడీపీ తీరును ఎండగడుతూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చురకలంటించారు.
టీడీపీ స్ఫూర్తితోనే ‘ఇండియా కూటమి’ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ‘ఈనాడు’ చెప్పింది. మరి తీర్మానానికి మద్దతుగా టీడీపీ సభ్యులు పార్లమెంట్ లో ఎందుకు లేచి నిలబడలేదో టీడీపీ కానీ, చంద్రబాబు కానీ, రామోజీ కానీ సమాధానం చెప్పాలి! pic.twitter.com/NZPJABgTpR
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2023
Comments
Please login to add a commentAdd a comment