‘చంద్రబాబుకు మీరే హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది’ | Vijayasai Reddy Tweet On TDP Leader Chandrababu Arrest | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలనుద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

Published Thu, Sep 21 2023 3:10 PM | Last Updated on Thu, Sep 21 2023 3:33 PM

Vijaya Sai Reddy Tweet On TDP Leaders Chandrababu Arrest - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ నేతలను ఉద్ధేశించి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ నేతల వ్యవహరం చూస్తుంటే వారే జైల్లో చంద్రబాబుకు హానీ తలపెడతారన్న అనుమానం కలుగుతోందని అన్నారు. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టేయాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోందన్నారు. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

మరోవైపు మహిళా బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ, శాసనమండలిలోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. అలాగే సెప్టెంబర్‌ను మహిళా చరిత్ర నెలగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏపీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో 50 శాతం మంది మహిళలకే కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement