ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తున్నట్లు ప్రచారం
బీజేపీ వైపు మొగుతున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రంగంలోకి దిగిన కాంగ్రెస్ పరిశీలకులు
ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ స్పషీ్టకరణ
ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు.
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు.
బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు.
బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది.
ప్రజా తీర్పును కాపాడుకుంటాం
హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment