UNEXPECTED
-
టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
క్రాష్ లాండింగ్ అంటే ఇలాగుంటుంది.!
-
ఊహించని ప్రదేశాలలో వింత ఆవిష్కరణలు
-
దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు...
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్యదేశమైన దక్షిణాఫ్రికా జట్టును వదిలి అసోసియేట్ టీమ్ అమెరికాతో జతకట్టేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయమే ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్‌పై సంతకం చేశా. చాలా కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ... ఇది నాకో మంచి అవకాశం. ఆర్థికంగానూ, జీవనశైలి పరంగానూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని వదులుకోలేకపోయాను. పైగా గతేడాది అమెరికాకు వన్డే జట్టు హోదా దక్కింది. ఇంకా ఆలోచించడానికి ఏముంది? దక్షిణాఫ్రికా వన్డే తుది జట్టులో తనకు చోటు దక్కే అవకాశాలు అతి స్వల్పంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ’ అని పీట్ వ్యాఖ్యానించాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ‘ మైనర్ లీగ్ టి20 టోర్నమెంట్’ నుంచి అతను అమెరికా తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. 2014లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేసిన పీట్ తొమ్మిది టెస్టుల్లో 26 వికెట్లు దక్కించుకున్నాడు. -
ఎండ మండుతోంది.. వాన కురుస్తోంది
నరసాపురం : వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుఉన్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించాయి. వారం రోజులుగా కొన్నిచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచీ భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులు, అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. సాధారణంగా మే నెలాఖరు నుంచి (రోహిణి కార్తె వెళ్లాక) ఈదురు గాలులు వీయటం.. వర్షాలు కురవటం పరిపాటి. అందుకు భిన్నంగా ఏప్రిల్ చివరి వారం నుంచే భారీ గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడమే ఈ మార్పులకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటివరకూ 35నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు వారం రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగాయి. భూమి ఒక్కసారిగా వేడెక్కడం, సాయంత్రం చల్లబడుతుండటంతో భూమి నుంచి వేడి వాయువుల పీడనం పైకి వెళుతోంది. ఈ కారణంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తు న్నాయి. వాతావరణంలో నెలకొన్న ఈ సర్దుబాట్లే ప్రస్తుత స్థితికి కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే గాలుల్లో వేగం పెరగడం ఈదురు గాలులకు కారణమని చెబుతున్నారు. తగ్గుతున్న తేమశాతం తీర ప్రాంతం కావడంతో మన జిల్లాలో తేమ శాతం అధికంగా ఉంటుంది. నాలుగు రోజులుగా గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. పగటిపూట తేమశాతం 60 నుంచి 70 శాతానికి తగ్గింది. రాత్రివేళ 80 నుంచి 90 శాతం నమోదవుతోంది. వారం క్రితం వరకు పగటిపూట 70 నుంచి 80 తేమ శాతం నమోదైంది. తగ్గుతున్న తేమ శాతంలోను గంటకో రకంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దీనివల్ల ఉక్కపోత కాస్త తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విజృంభిస్తున్న వ్యాధులు రోజుల వ్యవధిలో తేమ శాతంలో ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వాతావరణంలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నరసాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బళ్ల మురళి సూచించారు. వారం రోజులు ఇదే పరిస్థితి నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భూమి బాగా వేడెక్కింది. వాతావరణం చల్లబడ్డ తరువాత వచ్చే వేడి గాలుల వల్ల మేఘాలు ఏర్పడి వర్షిస్తున్నాయి. దీనికి ఈదురు గాలులు తోడయ్యాయి. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎన్.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం -
త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ
నడిగూడెం: మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న త్రైమాసిక పరీక్షలను సోమవారం సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా కో ఆర్డినేటర్ భూక్యా సక్రూనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగగా విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పరీక్షల నిర్వహన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేవారు. ఆయన వెంట ఫ్లైయింగ్ స్క్వాడ్ కె.జనార్దన్, ప్రిన్స్‌పాల్ గులాం ఎస్దాని, వైస్ ప్రిన్స్పాల డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుజాత, కవితారాణి, తదితరులున్నారు. -
అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ
నడిగూడెం: మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఐసీడిఎస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని రిజిస్టర్లు, చిన్నారుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే పౌష్టికాహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కృష్ణకుమారి, అసిస్టెంట్ సీyీ పీఓ వెంకటలక్ష్మి, సూపర్వైజర్లు కోటేశ్వరి, రాజ్యలక్ష్మి, తదితరులున్నారు.