ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం | French PM Michel Barnier Loses No-Confidence Vote | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం

Published Thu, Dec 5 2024 8:56 AM | Last Updated on Fri, Dec 6 2024 6:13 AM

French PM Michel Barnier Loses No-Confidence Vote

అవిశ్వాసంలో ఓడిన ప్రభుత్వం

ప్రధాని బార్నియర్‌ రాజీనామా

పారిస్‌: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని మైకేల్‌ బార్నియర్‌ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మితవాద, అతివాద విపక్షాలు చేతులు కలపడంతో ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 577 మంది సభ్యులున్న నేషనల్‌ అసెంబ్లీ దిగువ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి 331 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో తీర్మానం నెగ్గింది. 

ప్రధానిగా పగ్గాలు చేపట్టిన కేవలం మూడు నెలలకే బార్నియర్‌ తన పదవిని కోల్పోవాల్సి రావడం గమనార్హం. ప్రధాని తన రాజీనామాను దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌కు అందజేశారు. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం గత అరవై ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ఈ ఏడాది మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మళ్లీ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు.

 దీంతో కేవలం నూతన ప్రధానిని ఎంపిక చేసే బాధ్యతలు మాత్రం అధ్యక్షుడు మేక్రాన్‌ చేతికొచ్చాయి. ఇటీవలి కాలంలోనే ఈయన రెండు సార్లు ప్రధానులను ఎంపికచేశారు. జూలైలో పగ్గాలు చేపట్టిన గేబ్రియల్‌ కొద్దికాలానికి వైదొలగగా ఇప్పుడు బార్నియర్‌ అదేబాటలో పయనించారు. దీంతో మేక్రాన్‌ తాజాగా మూడోసారి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అధ్యక్షుడు మేక్రాన్‌ పదవికి సంబంధం లేదు. దీంతో మేక్రాన్‌ పదవికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement