కౌన్సిలర్లు ఇచ్చిన నోటీసును పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌పై బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇటీవల జైపాల్‌తోపాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటికి మద్దతు తెలిపారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయగా, మరో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీకి రాజీ నామా ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం 14 మంది బీఆర్‌ఎస్, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మంతనాలు జరి పారు. అనంతరం వీరంతా ఎమ్మెల్యే నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్‌కు అందజేశారు.
పొంగులేటి వర్గం కావడంతో..
వైరా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకుగాను బీఆర్‌ఎస్ 15, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు రెండు, సీపీఎం ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఇద్దరు స్వ తంత్ర అభ్యర్థులు, సీపీఎం కౌన్సిలర్ బీఆర్‌ఎస్‌లో చేరా రు. బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమాలకు జైపాల్ హాజరయ్యారు. దీంతో ఆయనపై బీఆర్‌ఎస్ వేటువేసింది.
ఆ తర్వాత మరో ముగ్గురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనా మా చేసి పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎజెండా కాపీలను కౌన్సిల్ సమావేశాలకు ముందు అందజేయడంలేదని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆయనపై మిగిలిన కౌన్సిర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment