
నా హాజరు శాతాన్ని వక్రీకరించారు
ఆంగ్ల పత్రికపై ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన హాజరు శాతాన్ని వక్రీకరించి ప్రచురించిందంటూ ఓ ఆంగ్ల పత్రికపై టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీల హాజరు శాతానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఓ ఆంగ్ల పత్రిక శుక్రవా రం ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. అందులో అత్యల్పంగా 9% మాత్రమే తాను సభకు హాజరైనట్టు పేర్కొందంటూ జితేందర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
తన హాజరు శాతం సదరు పత్రిక పేర్కొన్న దానికంటే అత్యధి కంగా ఉందని, ఈ విషయంలో నిజాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు..సదరు పత్రిక బహి రంగ క్షమాపణ చెప్పి.. తన హాజరు శాతాన్ని పక్కాగా తిరిగి ప్రచురించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో కూడా జితేందర్‌రెడ్డి ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. సదరు పత్రిక ఎడిటర్, పబ్లిషర్లకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.