
నోట్ల రద్దు పెద్ద కుంభకోణం: సురవరం
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని సీపీఐ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ జరగకపోవడానికి బీజేపీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లబాబులు దాచుకోవడానికే రూ.2 వేల నోటు తీసుకువచ్చారని విమర్శించారు. బ్యాంకులకు దాచుకున్న డబ్బులు కాదు దోచుకున్న డబ్బులే వస్తున్నాయని చెప్పారు. కేంద్రప్రభుత్వాన్ని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీనే మందలించారన్నారు. అహ్మదాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పెద్దమొత్తంలో నోట్లు మార్చుకున్నారన్నారు. ప్రధాని మోదీని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని సుధాకర్ రెడ్డి విమర్శించారు.