చవకగా అందుబాటులోకి తెచ్చే ఇళ్లకు మరిన్ని ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: చవకగా అందుబాటులోకి తెచ్చే ఇళ్లకు మరిన్ని ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో మంగళవారం రియల్ ఎస్టేట్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రియల్ ఎస్టేట్ బిల్లు స్వాగతించదగినది. ఇది వినియోగదారుల హక్కులను కాపాడుతుంది.
ఈ రంగంలో నేరాలు, జాప్యాలను తగ్గిస్తుంది. అయితే కొన్ని అంశాలపై ఈ బిల్లు మౌనం వహిస్తోంది. ప్రమోటర్లు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ లేకుండానే అడ్వాన్సులు తీసుకుంటారు. ఇలాంటి అంశాలకు ఈ బిల్లులో పరిష్కారం లేదు. అలాగే చవక ఇళ్లకు మరి న్ని రాయితీలు కల్పిం చాలి. వడ్డీ తగ్గించాలి. పన్నులు మినహాయిం చాలి. ‘2022 నాటికి అందరికీ ఇల్లు’ అనే నినాదాన్ని అమలు చేసేందుకు సానుకూల అవకాశాలను పరిశీలించాలి.’ అని వెలగపల్లి పేర్కొన్నారు.