
పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు.
ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలు లేవనెత్తాలని పార్టీ భావిస్తోందని, ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.