
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సాగాలనే ఉద్దేశం మోదీ సర్కారుకు లేనే లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకే ప్రతిష్టంభనను తొలగించేందుకు విపక్షాలతో రాజీ ప్రయత్నాలేవీ చేయడం లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. దాంతో చరిత్రలోనే తొలిసారిగా బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోందన్నారు. కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చా లేకుండానే ప్రభుత్వం ఆమోదముద్ర వేయించుకుంటోందని మండిపడ్డారు.
నిబంధనల ప్రకారం స్టాండింగ్ కమిటీలకు పంపాల్సిన బిల్లులను వ్యతిరేకత భయంతో తమ పార్టీ నేతల సారథ్యంలోని సెలెక్ట్ కమిటీలకు పంపుకుంటోందని ఆరోపించారు. మార్చి 13న మొదలైన రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఒక్క రోజు కూడా ఉభయ సభలు సజావుగా జరగని విషయం తెలిసిందే. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం విచారణకు విపక్షాలు, భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణకు అధికార బీజేపీ పట్టుబడుతుండటంతో రోజూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment