నేను మాట్లాడితే భూకంపమే
పెద్దనోట్ల రద్దు అంశంపై లోక్‌సభలో తనను మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ భయంతోనే ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని, తాను లోక్‌సభలోనే దీనిపై మాట్లాడలనుకుంటున్నానని, అక్కడ అన్నీ చెబుతానని అన్నారు.
ప్రధానమంత్రి యావత్ దేశంలో ప్రసంగాలు ఇస్తున్నారు గానీ, లోక్‌సభకు రావడానికి మాత్రం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు మీద చర్చించడానికి తాము దాదాపు నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నామని, పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు ఏవో తేలిపోవాలనే తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.