సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాల ఉత్పత్తి పెంచుతామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. పార్లమెండ్ సమావేశాల్లో భాగంగా మంగళవారం కోవిడ్ టీకాలపై రాజ్యసభలో మంత్రి మన్‌సుఖ్ వివరణ ఇచ్చారు. ఈ సదర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోవిషీల్డ్ ఉత్పత్తిని నెలకు 120 మిలియన్ డోసులకు పెంచుతామని తెలిపారు.
కొవాగ్జిన్ ఉత్పత్తిని నెలకు 58 మిలియన్ డోసులకు పెంచుతామని చెప్పారు. ఈనెల నుంచే టీకాల ఉత్పత్తి పెంపు ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధికి 'మిషన్ కోవిడ్ సురక్ష' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment