'ఉగ్రవాదులు ఎలా వచ్చారో అర్థంకాలేదు'
న్యూఢిల్లీ: గణతంత్ర్యవేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయినప్పటికీ ఆయుధాలు చేతపట్టుకున్న ఉగ్రవాదులు పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డారు. జనవరి 2న చోటుచేసుకున్న నాటి ఘటనతోపాటు దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితులపై అధ్యయనం చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. తన నివేదికను పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య మంగళవారం ఢిల్లీలో మాట్లాడారు.
'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చుట్టూ ఉన్న రక్షణ కంచె బలంగా లేదు. భద్రతా చర్యలు బలహీనంగా ఉన్నాయి' అని భట్టాచార్య అన్నారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కూడా ఉగ్రవాదులు లోపలికి ఎలా వచ్చారో అర్థంకాలేదని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుందన్న కమిటీ.. తీవ్ర చర్యలు చేపడితేతప్ప పరిస్థితిలో మార్పురాబోదని ప్రభుత్వానికి సూచించింది.