PSC
-
4న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన
కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ) జూన్ 4న రాష్ట్రంలో పర్యటించనుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. ఈ మేరకు పీఎస్సీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమాచారం అందించింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గడిచిన ఐదేళ్లలో నీటి సామర్ధ్యాల వివరాలు, ఈ ఏడాది పరిస్థితులు, గోదావరి, కృష్ణా అనుసంధానానికి ఉన్న అభ్యంతరాలతో పాటు నదుల కాలుష్యానికి కేటాయించిన నిధులు తదితర అంశాలపై ఈ కమిటీ ఆరా తీసే అవకాశం ఉంది. -
'ఉగ్రవాదులు ఎలా వచ్చారో అర్థంకాలేదు'
న్యూఢిల్లీ: గణతంత్ర్యవేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయినప్పటికీ ఆయుధాలు చేతపట్టుకున్న ఉగ్రవాదులు పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డారు. జనవరి 2న చోటుచేసుకున్న నాటి ఘటనతోపాటు దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితులపై అధ్యయనం చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. తన నివేదికను పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య మంగళవారం ఢిల్లీలో మాట్లాడారు. 'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చుట్టూ ఉన్న రక్షణ కంచె బలంగా లేదు. భద్రతా చర్యలు బలహీనంగా ఉన్నాయి' అని భట్టాచార్య అన్నారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కూడా ఉగ్రవాదులు లోపలికి ఎలా వచ్చారో అర్థంకాలేదని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుందన్న కమిటీ.. తీవ్ర చర్యలు చేపడితేతప్ప పరిస్థితిలో మార్పురాబోదని ప్రభుత్వానికి సూచించింది. -
1069 కొలువులకు ఆమోదం: ఆర్ధిక శాఖ
-
ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌కు పార్లమెంటరీ కమిటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగంపై వేసిన అత్యున్నత స్థాయి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పీఎస్సీ) జూన్ 3న హైదరాబాద్‌లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌ను సందర్శించనుంది. దేశంలో ఒక ప్రైవేటు కంపెనీని పీఎస్సీ సందర్శించడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీ... ఇక్కడ ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌తో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న రక్షణ రంగ సంస్థలను కూడా సందర్శించనుంది. ఆరు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రక్షణ, వైమానిక రంగానికి అవసరమైన అత్యంత కీలక పరికరాలను తయారు చేస్తోంది. ఇది కంపెనీ విశిష్ట సేవలకు దక్కిన గుర్తింపు అని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘కంపెనీ సాధించిన విజయాలను కమిటీకి వివరిస్తాం. ఎదుర్కొన్న కష్టాలనూ తెలియజేస్తాం. మేం లేవనెత్తే అంశాలను కమిటీ అధ్యయనం చేసి తగు పరిష్కారాలు సూచిస్తుందని భావిస్తున్నాం. తద్వారా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.