న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందం త్వరలో పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఎన్‌ఐఏ బృందం పాక్ పర్యటన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్‌ఐఏ డెరైక్టర్ జనరల్ శరద్‌కుమార్ శుక్రవారం తెలిపారు.
పఠాన్‌కోట్ దర్యాప్తు కోసం ఐదు రోజుల క్రితం భారత్‌కు వచ్చిన పాక్ బృందం శుక్రవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. కాగా, జేఐటీ దర్యాప్తు సమయంలో పాక్ అధికారులతో ఎన్‌ఐఏ చర్చలు జరిపింది. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ బృందాన్ని పాకిస్తాన్‌కు పంపాలని భావిస్తున్నట్లు చెప్పగా.. దానికి పాక్ సానుకూలంగా స్పందించినట్టు శరద్‌కుమార్ తెలిపారు. పఠాన్‌కోట్ దాడికి కుట్ర వెనుక జైషే మహమ్మద్ ఉందనేందుకు కీలక ఆధారాలను జేఐటీకి సమర్పించినట్లు పేర్కొన్నారు.
పాకిస్తాన్ వెళ్లనున్న ఎన్‌ఐఏ బృందం
Published Sat, Apr 2 2016 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement