
అడ్డగోలుగా విభజించి మళ్లీ చర్చలా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చర్చపై లోక్‌సభ స్పీకర్ అన్ని పార్టీలతో మాట్లాడారని, బీఏసీలో మాట్లాడిన తర్వాత ప్రత్యేక హోదా అంశంపై చర్చను పరిశీలిస్తామన్నారని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ముందుగానే వాగ్దానం చేసిన తర్వాత ఇంకా చర్చలెందుకని తాము అడిగినట్లు ఆయన తెలిపారు.
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి మళ్లీ చర్చలు అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలుచేయాలని మేకపాటి రాజమోహనరెడ్డి డిమాండ్ చేశారు.