టీడీపీ నాలుగేళ్ల పాటు బీజేపీపై ఎటువంటి వత్తిడి తేకపోవడం వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం వల్లే బీజేపీలో కనువిప్పు కలిగిందని అన్నారు. తమతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు అప్పుడే రాజీనామా చేసి ఉంటే కేంద్రం ఎప్పుడో దిగి వచ్చేదని పేర్కొన్నారు. కానీ టీడీపీ మాత్రం అవకాశ రాజకీయం, ద్వంద వైఖరి రాజకీయాలు చేస్తూ ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు